చాలాకాలం నుండి పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీని దూరం పెడుతున్నాడని తెగ వార్తలొస్తున్నాయి. ఇక మెగా ఫ్యామిలీ కూడా పవన్ ని ప్రతి విషయంలో హైలెట్ చెయ్యడం మానేసింది. ఏదో పిలిచాము వస్తే వస్తాడు... లేదా మానేస్తాడు అనే ధోరణిలో మెగా ఫ్యామిలీ ఉంటోంది. అయితే మీడియా మాత్రం పవన్ కళ్యాణ్ కి మెగా ఫ్యామిలీ కి మధ్యన చీలిక వచ్చిందని ప్రచారం చెయ్యడం మాత్రం మానుకోలేదు. అది ఈ మధ్యన చిరంజీవి చాలా గ్యాప్ తీసుకుని నటించిన 'ఖైదీ నెంబర్ 150' తో ఈ చర్చ మరింతగా ముదిరింది. 'ఖైదీ...' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి పవన్ రాకపోవడంతో ఈ విభేదాలు మరింత ముదిరినట్టు ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు 'ఖైదీ...' సినిమా రిలీజ్ అవడమూ.... ఆ సినిమా పెద్ద హిట్ అవడంతో పవన్ కళ్యాణ్ గురించి పెద్దగా చర్చ జరగడం ఆగింది.
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తన అన్న చిరుని కలిసి 'ఖైదీ నెంబర్ 150' విజయాన్ని సాధించినందుకు గాను శుభాకాంక్షలు తెలిపాడని చెబుతున్నారు. పవన్ స్వయంగా చిరు ఇంటికి వెళ్లి ఈ శుభాకాంక్షలు తెలిపినట్టు.... ఇంకా చిరంజీవితో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిపి... అన్నతో కలిసి డిన్నర్ కూడా చేసినట్టు ప్రచారం జరుగుతుండగా.... మరోవైపు ఇదంతా ఒక గాసిప్ అని అంటున్నారు. అసలు చిరంజీవిని పవన్ కళ్యాణ్ కలవలేదని.... వారు కలిసినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని అంటున్నారు. అసలు చిరంజీవిని పవన్ కలిసాడని చెబుతున్న టైమ్ లో చిరంజీవి ఒక పార్టీ లో బిజీగా వున్నాడని చెబుతున్నారు.
చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150' సాధించిన విజయానికి టి సుబ్బిరామిరెడ్డి ఒక పార్టీ ని ఏర్పాటు చెయ్యగా... ఆ పార్టీకి చిరంజీవితో పాటు నాగార్జున ఇండస్ట్రీలోని పెద్దలు హాజరయ్యారని.... మరలాంటప్పుడు చిరుతో పవన్ భేటీ ఎలా సాధ్యమయ్యిందనే వాదన బయలు దేరింది. ఒకవేళ పవన్.. చిరుని కలిసినా రాజకీయాలు గురించి చర్చించడం... డిన్నర్ చెయ్యడం అనేది ఒట్టి పుకారు అని అంటున్నారు. మరి నిజమేంటనేది మెగా ఫ్యామిలీ వాళ్ళు చెబితేనే మీడియా శాంతిస్తుంది. లేకుంటే రకరకాల కథనాలు ప్రచారంలోకి తెచ్చి మెగా ఫ్యామిలీకి ఊపిరాడకుండా చేస్తుంది.