తమిళనాట జల్లికట్టు వివాదం ముదిరి ముదిరి పాకాన పడింది. జల్లికట్టు నిషేధంపై సామాన్య మానవులే కాకుండా తమిళ స్టార్స్ కూడా పోరాటం జరుపుతున్నారు. ఇప్పటికే రాఘవ లారెన్స్, కార్తీ, శివ కార్తికేయన్ వంటి స్టార్స్ తమిళ ప్రజలతో కలిసి జల్లికట్టు ఉద్యమంలో పాల్గొంటున్నారు. మరికొందరు స్టార్స్ అయితే సోషల్ మీడియా సాక్షిగా మద్దతు తెలుపుతున్నారు. ఈ ఉద్యమం మెరీనా బీచ్ సాక్షిగా కొన్ని వేలమంది కలిసి చేస్తున్నారు. ఇక జల్లికట్టు సమస్యను ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం.. ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారు. మరో పక్క ఉద్యమం ఉదృతరూపం దాలుస్తున్న నేపధ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏ. ఆర్ రహమాన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. జల్లికట్టు తమిళుల సెంటిమెంట్ అని దాన్ని ఎత్తివేయడం ధర్మం కాదని వారి సెంటిమెంట్ అని శుక్రవారం నిరాహార దీక్ష కు పిలుపునిచ్చారు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ తో పాటు మన స్టార్స్ కూడా జల్లికట్టు కి సపోర్ట్ ఇస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్స్ తమ ట్విట్టర్ అకౌంట్ లో దీనిపై స్పందించి, తమిళనాడు తారలు చేపట్టిన స్ట్రైక్ కి సపోర్ట్ ని తెలియజేసారు.
ఇదిలా ఉంటే..కేంద్రం జల్లికట్టు పై సానుకూలంగా స్పందించి..సుప్రీం కోర్ట్ ఉత్తర్వుల వెనక్కి తీసుకునేలా చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తుంది. జల్లికట్టు కి ఇకపై ఎటువంటి ఆంక్షలు లేకుండా..చూస్తామని కేంద్రం హామీ ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది. దీంతో తారలు నిరాహార దీక్ష ని విరమించి సంబరాలు చేసుకుంటున్నారు.