నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ ఈ రోజు(19) బర్త్ డే జరుపుకుంటున్న సందర్భంగా ఆయన తాజాగా నటిస్తున్న సినిమాల పోస్టర్స్ ని వరుసగా రిలీజ్ చేసి వరుణ్ కి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. వరుణ్ తేజ్ - శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'మిస్టర్' పోస్టర్స్ ని ఒక రోజు ముందే విడుదల చెయ్యగా..... శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నటిస్తున్న 'ఫిదా' పోస్టర్స్ ని ఈ రోజు గురువారం విడుదల చేశారు. ఈ పోస్టర్స్ లో వరుణ్ లుక్ ని చూసినవారంతా 'ఫిదా' అయిపోవాల్సిందే. ఇక 'ఫిదా' మోషన్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. చాలా నెమ్మదిగా సాగే మ్యూజిక్ తో వరుణ్ తేజ్ క్లాస్ లుక్ తో అదిరిపోయాడనే చెప్పాలి. ఇక 'ఫిదా' టైటిల్ కి టాగ్ లైన్ గా అందరిని ఆకర్షించేలా 'లవ్-హేట్-లవ్ స్టోరీ' అని పెట్టారు. ఇక ఈ చిత్రం పూర్తిగా శేఖర్ కమ్ముల మార్క్ మూవీలనే ఉంటుందని ఈ మోషన్ పోస్టర్ చూస్తుంటే అర్ధమైపోతుంది. ఇక ఈ చిత్రం లో సాయి పల్లవి మొదటిసారిగా టాలీవుడ్ కి పరిచయమవుతుంది.