మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి గురించి తెలియనివారుండరు. మంచు లక్ష్మి అమెరికాలో చదివి ఇక్కడ తెలుగులో కొంచెం తడబడుతూ మాట్లాడుతూ అందరి గుండెల్లో గూడు కట్టుకుంది. ఇక సినిమాల్లో కూడా తనదైన స్టయిల్లో దూసుకుపోయే లక్ష్మి ఇప్పుడు రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. ఈ పాటికే మోహన్ బాబు అటువైపు అడుగులు వేస్తున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే మోహన్ బాబు ఏపీలో చంద్రబాబుని రాసుకుపూసుకు తిరగడం వంటివి చూస్తుంటే ఇది నిజమనిపించక మానదు. అందునా మోహన్ బాబు పూర్తి స్థాయి రాజకీయాల్లోకొస్తానని ఎప్పుడో చెప్పాడు. మరోపక్క సంక్రాతి పండగ రోజున మోహన్ బాబు కూతురు లక్ష్మితో కలిసి చంద్రబాబుని నారావారి పల్లెలో కలిసి శుభాకాంక్షలు కూడా తెలియజేశాడు.
ఇక మోహన్ బాబు సంగతి అటుంచితే అయన కూతురు ఇప్పుడు టిడిపి రాజకీయాల్లో కీలకం కానుందని అంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు ఈ విషయమై మోహన్ బాబుని అడగడం ఆయన సరే అనడం కూడా జరిగిందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అసలు చంద్రబాబు వైసిపిలో రోజాకి చెక్ పెట్టేందుకే ఇలా మంచు లక్ష్మిని రంగంలోకి దింపుతున్నట్టు చెబుతున్నారు. వైసీపీలో మంచి మాటకారి అయిన రోజాను తట్టుకుని నిలబడేందుకు మంచు లక్ష్మి అయితే కరెక్ట్ గా సరిపోతుందని బాబు భావిస్తున్నాడట. .ఇక ఒక సందర్భంలో చంద్రబాబు మంచు లక్ష్మి కూడా గ్లామర్ ఉన్న పొలిటికల్ లీడర్ అని కొనియాడారు.
ఇక లక్ష్మీని గల్లా అరుణ నియోజకవర్గం చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా రంగంలోకి దించడంగాని.... లేకుంటే రోజాకి పోటీగా నిలబెట్టే ఆలోచనలో టీడీపీ ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా మంచు లక్ష్మి ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర వహించనున్న మాట మాత్రం వాస్తవం అని అంటున్నారు చాలామంది.