బుధవారం నాడు ఇద్దరు సినీ ప్రముఖులు మాట్లాడిన దాంట్లో ఎంత తేడా? ఒకరి 'శాతకర్ణి' సక్సెస్ ను చిత్ర పరిశ్రమ విజయంగా పేర్కొంటే మరొకరు 'ఖైదీ..'. హిట్ చిరు సాధించిన విజయం అని చెప్పారు. ఒక సినిమా విజయం సాధిస్తే అది సమిష్టిగానే సాధించిందనే భావిస్తారు. ఇది నిజం కూడా. కేవలం ఒక వ్యక్తికి అప్పగించారు. ఈ వ్యత్యాసం ఇద్దరి ప్రముఖుల మాటల్లో వ్యక్తమైంది.
నందమూరి బాలకృష్ణ 'గౌతమిపుత్ర శాతకర్ణి' సక్సెస్ ను మొత్తం తెలుగు జాతికి అప్పగించారు. పరిశ్రమ విజయంగా కొనియాడారు. అదే అల్లు అరవింద్ విషయానికి వస్తే చిరంజీవి పునరాగమనానికి స్వాగతం అంటూ చిరంజీవి సాధించిన విజయం అని పేర్కొన్నారు. ఈ మాటలు ఆయన అహంకారానికి దర్పణం పడుతున్నాయి. తన పక్కనే చిత్ర దర్శకుడు వినాయక్ ఉన్నప్పటికీ, అతడి ప్రతిభ ఏమిలేదని చెప్పకనే చెప్పారు.
గతంలో చిరంజీవి నటించిన సినిమాలు పరాజయం చెందిన సందర్భాలున్నాయి. అల్లు అరవింద్ మాటల్లో చెప్పాలంటే ఆ పరాజయాలను చిరంజీవికే అప్పగించాల్సి వస్తుంది. కేవలం చిరంజీవిని ఆకాశానికెత్తడానికి ప్రతి సందర్భాన్ని అల్లు వారు ఉపయోగించుకుంటున్నారు. కొడుకు అల్లు అర్జున్ 'సరైనోడు' చిత్రం ద్వారా బాక్సాఫీస్ విజయం సాధించినా కలగని ఆనందం 'ఖైదీ...' సినిమాకు పొందుతున్నారు. మళ్లీ చిరంజీవిని అడ్డం పెట్టుకుని పావులు కదపడానికి, పక్కలో బల్లెంలా మారిన పవన్ కల్యాణ్ ను తక్కువ చేయడానికి ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.