Advertisementt

కొడుకు కోసం డైరెక్టర్ అవుతానంటున్న హీరో..!

Thu 19th Jan 2017 09:16 PM
nandamuri balakrishna,son mokshagnan,first movie entry aditya 999 movie,gautamiputra satakarni movie  కొడుకు కోసం డైరెక్టర్ అవుతానంటున్న హీరో..!
కొడుకు కోసం డైరెక్టర్ అవుతానంటున్న హీరో..!
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీ అయిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఈ సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ అయ్యింది. కలెక్షన్స్ పరంగా బాక్స్ ఆఫీస్ ని దున్నేస్తున్న ఈ చిత్ర విజయానికి బాలకృష్ణ ఫుల్ ఖుషీగా వున్నాడు. తెలుగువారి ఆత్మగౌరవాన్నిచాటి చెప్పిన 'గౌతమీపుత్ర...' చిత్రాన్ని  అంతా ఆదరిస్తున్నారని ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇంకా తనకి సిక్స్ ప్యాక్ వంటివి ఈ వయసులో నచ్చావని..... అలా చొక్కాలిప్పి బాడీని చూపిస్తూ రొమాన్స్ చేసే కథలు తన వయసుకు తగవని చెప్పాడు.

ఇంకా అయన కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.... మా మోక్షు త్వరలోనే సినీ అరంగేట్రం చేస్తాడని తెలిపాడు. అయితే తాను నటించబోయే మొదటి చిత్రం 'ఆదిత్య 999' అవుతుందని.... అయితే ఈ 'ఆదిత్య 999'కి తాను కూడా దర్శకత్వ బాధ్యతలు చేపట్టే సూచనలున్నాయని తెలిపాడు. అంటే ఇప్పటివరకు ఎప్పుడూ దర్శకత్వం గురించి మాట్లాడని బాలయ్య మొదటిసారి తన కొడుకు కోసం డైరెక్టర్ గా మారినా ఆశ్చర్యపోవక్కర్లేదని హింట్ ఇచ్చేసాడు. మరి ఏ దర్శకుడికైనా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తాడా? లేక తానే పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపడతాడా? అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ