Advertisementt

తారలకు సొంత అభిప్రాయాలు ఉండవా..?

Thu 19th Jan 2017 11:55 AM
cine star,opinions,jallikattu,tamilnadu,trisha  తారలకు సొంత అభిప్రాయాలు ఉండవా..?
తారలకు సొంత అభిప్రాయాలు ఉండవా..?
Advertisement

తమిళనాడులో జల్లికట్టు నిర్వాహకుల తీరు ఆందోళన కలిగిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలు సైతం గౌరవించకుండా, జల్లికట్టు నిర్వహించాలని, దీనికి సినీ తారలు మద్దతు పలకాలంటూ బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. సాంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టుకు తమిళ ప్రజల్లో ఎక్కువమంది మద్దతు ఉంటుంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు సైతం అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. సినీ తారల విషయానికి వస్తే చాలా మంది తమ ట్విట్టర్ల ద్వారా మద్దతు తెలిపారు. వారిలో రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, శరత్‌కుమార్‌, విజయ్‌, శింబు వంటి స్టార్స్‌ ఉన్నారు. నటి త్రిష ట్విట్టర్లో మాత్రం జల్లికట్టుకు వ్యతిరేకంగా పోస్ట్‌ చేసింది. ఇది ఆందోళనకు కారణమైంది. ఫెటా (జంతు పరిరక్షణ సంస్థ)లో త్రిష సభ్యురాలు కావడం వల్లే వ్యతిరేకంగా పోస్ట్‌ చేసిందనేది ఆరోపణ. అయితే తన ఎకౌంట్‌ను ఎవరో హ్యాక్‌ చేశారని, తన మద్దతు జల్లికట్టుకు ఉందని ఆమె వివరణ ఇచ్చినప్పటికీ, ఆందోళన ఆగలేదు. చివరికి రక్షణ కోసం త్రిష తల్లి పోలీసుల ఆశ్రయం కోరింది. 

ఈ పరిణామం చూస్తుంటే ఆశ్చర్యం కలిగిస్తోంది. సినీ తారలకు వ్యక్తిగత అభిప్రాయాలు ఉండకూడదా?. బలవంతంగా వారిని అభిప్రాయాలు మార్చుకొమ్మని చెప్పే అధికారం ఎవరికైనా ఉందా? అనే అనుమానం కలుగుతోంది. నటుడు విశాల్‌పై కూడా జల్లికట్టు నిర్వాహకులు ఆగ్రహంతో ఉన్నట్టు కథనాలు వచ్చాయి. సినీ తారలు తాము చెప్పినట్టుగా వినాలనే పోకడ ఆందోళన కలిగిస్తోంది. భవిష్యత్తులో ఇది మరిన్ని పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంది. ఆర్టిస్టులైనా సరే వారికంటూ అభిప్రాయం ఉంటుంది. దాన్ని వెల్లడించే అధికారం కూడా ఉంటుంది. అంతేకానీ ఒత్తిడితో లేదా భయపెట్టో దారిలోకి తెచ్చుకోవాలంటే మాత్రం అవివేకమే అవుతుంది. ఇది నేడు తమిళనాడులో జరిగినా భవిష్యత్తులో ఇతర ప్రాంతాల్లో కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement