తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమ్మారెడ్డి భరద్వాజ అంటే తెలియనివారుండరు. ఎటువంటి మొహమాటానికి పోకుండా డైరెక్టుగా మనసులో మాటను బయటకి చెప్పేసే వ్యక్తిగా భరద్వాజకి పేరుంది. ఎప్పుడూ నిర్మొహమాటంగా మాట్లాడే తమ్మారెడ్డి ఇప్పుడు మరోసారి సంక్రాంతికి విడుదలైన సినిమాల గురించి తనదైన స్టయిల్లో సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఈ సంక్రాతికి పోటీ పడిన మూడు సినిమాల్లో ఎవరిది పై చెయ్యో చెప్పకనే చెప్పేసాడు.
మొదటిగా ఈ సంక్రాతికి బరిలోకి దిగిన మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' గురించి మాట్లాడుతూ ..... ఈ చిత్రం చిరు కెరీర్ లో 150 వ చిత్రం. ఇక ఈ 'ఖైదీ....' చిత్రం కలెక్షన్స్ లో దుమ్ముదులిపేస్తుందని.... చిరంజీవి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ దుమ్ముదులపడం ఎలా ఉంటుందో ఈ చిత్రం మరోసారి రుజువు చేసిందని...... అమ్మడు.. కుమ్ముడు అంటూనే కలెక్షన్లను కుమ్మేయడం ఒక్క చిరుకే సాధ్యమని అన్నారు. అయితే మెగాస్టార్ చిరు స్థాయి ఇది కాదని..... ఆయన దీనికన్నా అద్భుతాలు చేయగలరని అన్నారు. అసలు చిరుకున్న స్టార్ హోదా ముందు ఈ కలెక్షన్స్ ఏమాత్రం సరిపోవన్నాడు. ఇంకా 'ఖైదీ....' చిత్రాన్ని బాగా తీసుంటే ఇంకా పెద్ద సూపర్ హిట్ అయ్యేదని అన్నాడు.
ఇక ఈ సంక్రాతి బరిలో దిగిన రెండవ చిత్రం బాలకృష్ణ నటించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' గురించి మాట్లాడుతూ... తాను ఊహించినదానికంటే 'గౌతమీపుత్ర శాతకర్ణి' చాలా గొప్పగా ఉందని..... బాలకృష్ణ కెరీర్లో ఒక గొప్ప సినిమాగా ఈ 'గౌతమీపుత్ర..... ' మిగిలిపోతుందని అన్నారు. అసలు ఇంత తక్కువ సమయంలో ఈ సినిమాని తెరకెక్కించినా... పర్‌ఫెక్ట్ సినిమాగా మల్చగలిగారని.... 'బాహుబలి, గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాల బడ్జెట్లు వేరయినా 'బాహుబలి'తో పోల్చి చూసే స్థాయికి 'గౌతమీపుత్ర....' వెళ్లిందన్నారు. తెలుగు సినిమాను మరో స్థాయికి ఈ 'గౌతమీపుత్ర శాతకర్ణి' తీసుకెళ్లిందని అన్నారు.
ఇక మూడో సినిమాగా సంక్రాతి బరిలో నిలిచిన శర్వానంద్ 'శతమానంభవతి' గురించి కూడా చెప్పిన భరద్వాజ.... 'శతమానం భవతి' కేవలం క్లాస్ ఆడియెన్సుని దృష్టిలో పెట్టుకుని తీసింది కాబట్టే ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చిందని.... ఇది కేవలం కుటుంబకథా చిత్రంగా నిలిచిపోతుందని చెప్పారు.
మరి ఫైనల్ గా తమ్మారెడ్డి ఏ సినిమా విన్ అయ్యిందో చెప్పకనే చెప్పేసాడు. ఆయన దృష్టిలో బాలకృష్ణ నటించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' నే ఈ సంక్రాతి విన్నర్. మరి భరద్వాజ మాటలని మెగా ఫ్యాన్స్ ఏ విధం గా అర్ధం చేసుకుంటారో గాని మళ్ళీ ఎటువంటి యుద్ధ వాతావరణం ఏర్పడుతుందో అని అందరూ కొంచెం టెంక్షన్ గానే ఎదురు చూస్తున్నారు.