Advertisementt

రష్మీ ని చూస్తుంటే పాపం అనిపిస్తుంది కదూ..!

Wed 18th Jan 2017 09:10 PM
bullitera,rashmi,jabardasth comedy show,anusuya,anchor rashmi,item song chance missing,hamsa nandini,kittu unnadu jagratha movie  రష్మీ ని చూస్తుంటే పాపం అనిపిస్తుంది కదూ..!
రష్మీ ని చూస్తుంటే పాపం అనిపిస్తుంది కదూ..!
Advertisement
Ads by CJ

బుల్లితెరమీద జబర్దస్త్ షో లో అనసూయ ప్లేస్ లోకి దూసుకొచ్చి వచ్చిరాని తెలుగుతో తెలుగు ప్రేక్షకులను, యువతను తన గ్లామర్ షో తో ఒక ఊపు ఊపుతున్న రష్మీ మరోపక్క వెండితెర మీద కూడా అందాల ఆరబోతతో హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇచ్చే రేంజ్ కి ఎదిగింది. ఇక అనసూయ జబర్దస్త్ లోకి రీఎంట్రీ ఇచ్చినా కూడా ఎక్సట్రా జబర్దస్త్ అంటూ ఆ షో ని అంటుకుపోయిన రష్మీ కి అనసూయ నుండి గ్లామర్ షో పరంగా గట్టిపోటీనే ఎదురవుతుంది. ఇక అన్ని విషయాల్లో అనసూయతో పోటీ పడుతున్న రష్మీ అటు సినిమాల్లో కూడా అనసూయతో సమానంగా రెచ్చిపోయినప్పటికీ కొన్ని సార్లు ఆమెకు కాలం కలిసిరాక నీరసపడిపోయింది.

ఒక పక్క అనసూయ 'విన్నర్' చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన ఐటెం సాంగ్ లో రెచ్చిపోతుండగా రష్మీకి మాత్రం అలాంటి ఒక ఐటెం సాంగ్ అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయిందంటున్నారు. హీరో రాజ్ తరుణ్ తాజా చిత్రం 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' లో రష్మి ఐటెం సాంగ్ లో కనిపిస్తుందని ఆ మధ్యన ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది. అయితే ఆ ఆఫర్ ఇప్పుడు మిస్ అయ్యిందని అంటున్నారు. రష్మీకి వచ్చిన ఆ ఐటెం అవకాశాన్ని హంసా నందిని తన్నుకుపోయిందని చెబుతున్నారు. ఇప్పటికే హంసా నందిని 'మిర్చి' చిత్రంలో 'అత్తారింటికి దారేది' మొదలగు  చిత్రాలలో ఐటెం సాంగ్స్ తో రెచ్చిపోయింది. ఇక అందుకే రష్మీ కంటే హంసా నందిని అయితేనే ఈ ఐటెం సాంగ్ కి బావుంటుందని భావించిన చిత్ర యూనిట్ రష్మిని తప్పించి హంసా నందినికి ఛాన్స్ ఇచ్చారనే ప్రచారం జరుగుతుంది.ఇప్పటికే 'గుంటూరు టాకీస్' మొదటి భాగంలో నటించిన రష్మీకి ఇప్పుడు 'గుంటూరు టాకీస్ 2'  లో నటించే అవకాశం కోల్పోవడం....... ఇక ఇప్పుడు 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' లో ఐటెం సాంగ్ చేసే అవకాశం చేజారిపోవడం వంటివి చూస్తుంటే పాపం రష్మీ అనిపిస్తుంది కదూ..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ