Advertisementt

రేవంత్‌రెడ్డి... నాగ్‌ను టార్గెట్‌ చేశాడు..!

Wed 18th Jan 2017 08:36 PM
akkineni nagarjuna,dil raj,raghadendrarao,om namo venkatesaya movie,telangana tdp mla revanth reddy,minister ktr  రేవంత్‌రెడ్డి... నాగ్‌ను టార్గెట్‌ చేశాడు..!
రేవంత్‌రెడ్డి... నాగ్‌ను టార్గెట్‌ చేశాడు..!
Advertisement

ఇటు హీరోగా సినిమాలు, మరోవైపు హీరోలైన తన కొడుకుల కెరీర్స్‌ను సరిదిద్దాల్సిన బాధ్యత..మరోవైపు కొడుకులకు పెళ్లిళ్లు చేసి, ఓ ఇంటివారిని చేసే పనులు.. మరోవైపు నిర్మాతగా, స్టూడియో అధినేతగా, పలు వ్యాపారాలలో భాగస్వామిగా... ఇలా అన్నింటినీ బ్యాలెన్స్‌ చేస్తూ.. తనకు తానే సాటి అని నాగ్‌ నిరూపించుకుంటున్నాడు. ఇక హీరోగా ఆయన రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేసిన మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'ను ఫిబ్రవరి10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చైతూతో కళ్యాణ్‌కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రాన్ని, అఖిల్‌ హీరోగా విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో ప్రారంభంకానున్న రెండో చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా చైతూతోనే మంచి కథ దొరికితే 'మనం' తర్వాత మరలా కలిసి చేస్తానని నాగ్‌ చాలాసార్లు చెప్పారు. 

ప్రస్తుతం అటువంటి అద్భుతమైన, మానవ బంధాలు, అనుబంధాల నేపథ్యంలో ఓ మంచి కథ ఆయనకు నచ్చిందనే ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి కానుకగా దిల్‌రాజు నిర్మాణంలో శర్వానంద్‌, అనుపమ పరమేశ్వరన్‌లు జంటగా వచ్చిన 'శతమానం భవతి' చిత్రానికి దర్శకత్వం వహించిన రచయిత, దర్శకుడు సతీష్‌వేగ్నేష్‌ ఆ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది, భారీ పోటీలో కూడా సినిమాకు మంచి హిట్‌ టాక్‌ సొంతం చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఈయనే ఇటీవల దిల్‌రాజుకే నాగ్‌, చైతులకు సరిగ్గా సూట అయ్యే మంచికథను చెప్పాడట. ఇప్పటికే దిల్‌రాజుకు నాగ్‌ ఒక చిత్రం చేస్తానని మాట ఇచ్చాడు. రవితేజ ఆపేసిన 'ఎవడో ఒకడు' చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల దానికి నో చెప్పాడు. 

దాంతో సతీష్‌వేగ్నేష్‌ దర్శకత్వంలో తాను, చైతూలు కలిసి దిల్‌రాజుకు సినిమా చేయడానికి ఓకే చెప్పాడని సమాచారం. తాజాగా ఆయనపై రాజకీయ దుమారం మరలా లేచింది. తెలంగాణ టిడిపి నాయకుడు రేవంత్‌రెడ్డి నాగ్‌ను టార్గెట్‌ చేశాడు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్‌ మాట్లాడుతూ, జిహెచ్‌ఎంసీ పరిధిలో పలు చెరువులు ఆక్రమణకు గురయ్యాయని, వాటిపై టిఆర్‌ఎస్‌ ఏం చర్యలు తీసుకుంటోందని ప్రశ్నించాడు. ఎన్‌ కన్వెక్షన్‌ సెంటర్‌ వద్ద మల్టీప్లెక్స్‌ల నిర్మాణాన్ని ఆపాలని కోరాడు. ఇప్పటికే నాగార్జున సెంటర్‌ వద్ద ట్రాఫిక్‌ జామ్‌ అవుతోందంటూ ఆరోపించారు. దానికి తెలంగాణ మంత్రి కెటీఆర్‌ సమాధానం ఇస్తూ.. నాగ్‌కు గిఫ్ట్‌లు, మినహాయింపు ఇచ్చే సంస్కృతి తమకు లేదన్నారు. ఈ విషయంపై చట్టప్రకారం అందరిపై చర్యలు తీసుకుంటామని తెలిపాడు. ఇలా నాగ్‌ ఇప్పుడు రాజకీయ దుమారంలో కూడా ఇరుక్కున్నారు.మరో పక్క ఆయన నటించిన బ్లాక్‌బస్టర్‌ మూవీ 'సోగ్గాడే చిన్ననాయనా' తమిళ రీమేక్‌ హక్కుల కోసం ఎందరో పోటీ పడినప్పటికీ గతంలో తనకు కోలీవుడ్‌లో ఉన్న గుర్తింపు, తాజాగా 'ఊపిరి' చిత్రాన్ని తమిళంలో కూడా చేసిన ఆయన అక్కడ మరింత మార్కెట్‌ పెంచుకునే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని తమిళంలోకి అనువాదం చేస్తున్నాడు. దీనిని 'సొక్కాలిమైనర్‌' పేరుతో విడుదల చేయనున్నారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement