అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి నేచురల్‌స్టార్‌గా మారిన నాని తన పదేళ్ల కెరీర్‌లో ఎలాంటి ఇమేజ్ ఛట్రంలోనూ ఇరుక్కుపోలేదు. తాజాగా విడుదలకు రెడీ అవుతోన్న 'నేను..లోకల్' చిత్రంలో నాని తొలిసారిగా ఫుల్‌లెంగ్త్ మాస్ రోల్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. టీజర్‌లో కీర్తి సురేష్‌తో రొమాంటిక్ ఫీలింగ్‌ను కలిగించిన ఆయన ట్రైలర్‌లో మాత్రం పక్కా మాస్ కుర్రాడిగా కనిపిస్తున్నాడు. ఇందులో ఆయన మాస్‌గా కనిపిస్తుంటే మరోపక్కన ఈ చిత్రంలోని డైలాగ్స్ నవ్వుపుట్టించేలా ఉన్నాయి. 'వీడు మామూలోడు కాదే.. జండూబామ్‌కి కూడా తలనొప్పితెప్పించేరకం...' అనే డైలాగ్ కేకపుట్టిస్తోంది. ఇక 'ఒక అమ్మాయి తెల్లవారుజామున 4గంటలకు లేచి చదువుతోందంటే.. అది మార్చి అని అర్ధం. ఒక అబ్బాయి ఉదయం 4గంటలకే లేచి చదువుతుంటే అది సెప్టెంబర్ అని అర్ధం...ది రిలేషన్‌షిప్ బిట్వీన్ మార్చి అండ్ సెప్టెంబర్ షుడ్‌లైక్ ఎ షిప్.. అంటూ 'పెదరాయుడు' చిత్రంలో మోహన్‌బాబు భార్యాభర్తలను ఉద్దేశించి చెప్పిన ఫేమస్ డైలాగ్‌కి పేరడీగా ఉన్న ఈ సంభాషణ వింటే ఇదో ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్... అని అర్దమవుతోంది.
ఇక ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తుండటం.. దేవిశ్రీప్రసాద్ తొలిసారిగా నాని చిత్రానికి సంగీతం అందిస్తుండటం.. 'ఖైదీ'తో ఇరగదీసిన దేవిశ్రీ తదుపరి చిత్రం ఇదే కావడం.. ఇప్పటికే పాటలు యూత్‌ను బాగా మెప్పిస్తుండటం... 'సినిమా చూపిస్తా మావా' తర్వాత డైరెక్టర్ త్రినాథ్‌రావు నక్కిన అదే తరహాలో ఇందులో కూడా కామెడీతో గిలిగింతలు పెట్టడం ఖాయమనే నమ్మకం.. ప్రస్తుతం టాప్‌స్టార్స్ చిత్రాలలో అవకాశాలు సాధిస్తూ ఉన్న కీర్తి సురేష్ 'నేను.. శైలజ' తర్వాత తాను చేస్తున్న రెండో తెలుగు చిత్రం ఇదే కావడం.. వంటి పలు అంశాలు ఈ చిత్రంపై మంచి అంచనాలను రేకెత్తిస్తున్నాయి. మొత్తానికి ఈ చిత్రం నాని కెరీర్‌లో మరో వరుస విజయం అవుతుందనడంలో సందేహం లేదని సినీ ప్రియులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ చిత్రం నానికి ఎలాంటి హిట్‌ను అందించనుందో వేచిచూడాల్సివుంది.