Advertisementt

అల్లు అర్జున్ కి రామ్ చరణ్ తో కూడా చెడిందా..!

Wed 18th Jan 2017 11:37 AM
allu aravind,allu arjun,ram charan,chiranjeevi,khaidi no 150 movie  అల్లు అర్జున్ కి రామ్ చరణ్ తో కూడా చెడిందా..!
అల్లు అర్జున్ కి రామ్ చరణ్ తో కూడా చెడిందా..!
Advertisement
Ads by CJ

చిరంజీవి చాలా రోజుల తర్వాత 'ఖైదీ నెంబర్ 150' తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ రీఎంట్రీ ని మెగా ఫ్యామిలీ అంతా ఫుల్ సపోర్ట్ చేసింది. అల్లు అరవింద్ అయితే మళ్ళీ చిరు సినిమాకి ప్రొడ్యూసర్ గా అవతారమెత్తుదామనుకున్న టైం కి ఆ ఛాన్స్ నాకే కావాలని చరణ్ ఒక కొత్త ప్రొడక్షన్ కంపెనీని స్టార్ట్ చేసి అరవింద్ కు షాక్ ఇచ్చాడు. ఇక ఏది ఏమైనా మామ ఆధ్వర్యంలోనే 150  సినిమా నిర్మాతగా చరణ్ వ్యవహరించాడు. అయితే అదేమి మనసులో పెట్టుకోకుకండా పబ్లిసిటీ కార్యక్రమాల్లో అల్లు అరవింద్ రామ్ చరణ్ కి చేదోడు వాదోడుగా మారి చాలా హెల్ప్ చేసాడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ దగ్గర నుండి నిన్నమొన్నటి కలెక్షన్స్ గురించి ప్రెస్ కు చెప్పడం వరకు అరవింద్ ఆద్వర్యంలోనే జరిగాయి.

అయితే ఇలా అరవింద్ మొత్తం 150వ చిత్రానికి అన్ని తానై చరణ్ కి సహకరించడం అరవింద్ కొడుకు అల్లు అర్జున్ కి నచ్చలేదనే టాక్ ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్ లో వినబడుతోంది. తన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించినప్పుడు కూడా ఇలా చిరు 150  చిత్రానికి చేసిన పనులు చెయ్యలేదని బన్నీ తండ్రిపై కోపంగా వున్నాడని అంటున్నారు. 'సరైనోడు' సినిమా హిట్ అయినప్పుడు ఆ సినిమ నిర్మాత అల్లు అరవింద్ కలెక్షన్స్ గురించి మీడియాకి చెప్పకుండా ఇప్పుడు 'ఖైదీ నెంబర్ 150' విషయంలో మాత్రం సినిమా విడుదల అయిన మరుసటిరోజే ప్రెస్ మీట్ పెట్టి  మరీ ఉత్సాహంగా 'ఖైదీ....' ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి ప్రకటించడం పట్ల అల్లు అర్జున్ కోపంగా ఉన్నాడనే టాక్ ఇప్పుడు తెగ వినబడుతోంది.

ఇక మరోపక్క రామ్ చరణ్, అల్లు అర్జున్ ని పట్టించుకోవడంలేదనే టాక్ కూడా హల్ చల్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గురించి వైజాగ్ లో చెప్పను బ్రదర్ అంటూ కామెంట్స్ చేసిన అర్జున్ ని మెగా పవన్ ఫ్యాన్స్  'ఖైదీ...' ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చుట్టిముట్టి గొడవ చెయ్యడంతో చరణ్ ఎందుకైనా మంచిది అల్లు అర్జున్ తో కొంచెం దూరంగానే ఉండడం బెటర్ అని వేదికపై అర్జున్ తో మాట్లాడకుండా జాగ్రత్త పడ్డాడని.... అందుకే మెగా ఫ్యామిలిలో పవన్ విషయంతోపాటే చరణ్, అర్జున్ విషయం కూడా చెడిందనే టాక్ బయలుదేరింది. మరి ఎంతో ప్రేమతో చిరు 150  సినిమా చెయ్యడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న అల్లు హీరోలు ఇప్పుడు పెద్దగా సంతోషంగా లేరనే మాట వినబడుతోంది.మరి ఇది నిజమో కాదో తెలియదు గాని ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే పెద్ద హాట్ టాపిక్ గా అయ్యింది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ