Advertisementt

ఆసక్తిగా సాగిన చిరు సమాధానాలు...!

Tue 17th Jan 2017 08:08 PM
khaidi no 150,chiranjeevi,ram charan,vv vinayak,niharika,interview  ఆసక్తిగా సాగిన చిరు సమాధానాలు...!
ఆసక్తిగా సాగిన చిరు సమాధానాలు...!
Advertisement

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 'ఖైదీ నెంబర్‌ 150' చిత్రం కలెక్షన్లపరంగా దూసుకుపోతూ, ఆయన అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. పదేళ్లు గ్యాప్‌ వచ్చినా ఆయన పవర్‌ మాత్రం తగ్గలేదని ఆ చిత్రానికి వస్తున్న కలెక్షన్లు చూస్తే అర్ధమవుతోంది. కాగా ఈ చిత్రం ప్రమోషన్‌ కోసం తయారు చేసిన ఇంటర్వ్యూ ఇప్పుడు అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. ఈ ఇంటర్వ్యూలో హీరో చిరంజీవి, నిర్మాత రామ్‌చరణ్‌, దర్శకుడు వినాయక్‌ పాల్గొనగా మెగాడాటర్‌ నిహారిక పలు ఆసక్తికర ప్రశ్నలను వేసింది. వాటికి చిరు కూడా అదే ఆసక్తికరంగా సమాదానం ఇచ్చారు. ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూలోని ఓ ప్రశ్న అందరినీ విపరీతంగా ఆకర్షిస్తోంది. 

మెగాడాటర్‌ నిహారిక చిరును ఉద్దేశించి, డాడీ... మీ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఏమిటో చెబితే నేను మా నాన్నకు కూడా చెప్పి ఆయన్ను కూడా ఫిట్‌గా ఉంచుకుంటాను? అని అడగ్గా.. చిరు సమాధానం ఇస్తూ... ఫిట్‌నెస్‌ మెయిన్‌టెయిన్‌ చేయాలంటే కుటుంబసభ్యుల ప్రోత్సాహం, సహకారం ఉండాలి. ఈ విషయంలో సురేఖ ఎంతో కేర్‌ తీసుకుంది. ఇక చరణ్‌ అయితే నేను బరువు తగ్గడానికి, ఫిట్‌గా ఉండటానికి ఓ ట్రైనర్‌ను సైతం ఏర్పాటు చేశాడు. కానీ ఆ తర్వాత నాకు అర్ధమైంది ఏమిటంటే.... వారు నాపై ప్రేమతో ఆ పనిచేయలేదు. సురేఖ ఈ చిత్రానికి సమర్పకురాలు.. చరణ్‌ నిర్మాత.. కాబట్టి హీరో ఫిట్‌గా, బాగా ఉంటేనే కదా...! సినిమాకు నాలుగు డబ్బులు మిగులుతాయి. అందుకే వారు డబ్బుపై ప్రేమతోనే నన్ను నానా హింసలు పెట్టారని సమాధానం ఇచ్చాడు. కానీ మద్యలో వినాయక్‌ కల్పించుకొని.. కాదు.. కాదు.. చరణ్‌కు మీరంటే చాలా ప్రేమ. ప్రతిరోజు నాకు ఫోన్‌ చేసి, షూటింగ్‌లో ఉన్న మీ యోగక్షేమాలు విచారించేవాడు.. అని చెప్పారు.

ఇక చరణ్‌తో మీ చిత్రాలలో ఏది రీమేక్‌ చేయాలని మీరు కోరుకుంటున్నారు? అన్నదానికి చిరు.. 'జగదేకవీరుడు.. అతిలోక సుందరి' అని, ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా నా మొదటి ఆప్షన్‌ మాత్రం శ్రీదేవి కూతురేనని తెలిపాడు. కానీ చరణ్‌ మాత్రం ఈ ప్రశ్నకు భిన్నంగా స్పందించాడు. తనకు నాన్నగారు నటించిన 'గ్యాంగ్‌లీడర్‌'ని రీమేక్‌ చేయాలని ఉందంటూ తన మనసులోని అభిప్రాయాన్ని తెలిపాడు. 

Click Here to see the Full Interview

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement