తమిళ ప్రజల ఆరాధ్యదైవం, వెండితెర వేల్పు ఎవ్జీుఆర్ (మరుదూరు గోపాల రామచంద్రన్) శత జయంతి నేడు. ఆయన శ్రీలంకలోని కాండీ సమీపంలో 17 జనవరి 1917లో జన్మించారు. చిన్నతనంలో పేదరికం అనుభవించారు. కొద్ది రోజుల తర్వాత ఒరిజినల్ బాయ్స్ అనే డాన్స్ ట్రూప్‌లో చేరారు. ఆ అనుభవంతో సినీరంగ ప్రవేశం చేసి, ఎదిగారు. తమిళ తొలి సూపర్‌స్టార్‌గా ప్రేక్షకాదరణ చూరగొన్నారు. సినిమాల్లో నటిస్తున్నపుడే అన్నాదురే స్పూర్తితో రాజకీయ ప్రవేశం చేసి డిఎంకె పార్టీలో చేరారు. అక్కడ పొసగలేక సొంతంగా అన్నాడిఎంకె పార్టీ నెలకొల్పారు. 1977 నుండి మరణించే (1987) వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
సుమారు రెండు వందల సినిమాల్లో నటించిన ఎవ్జీుఆర్‌కు విప్లవ నటుడిగా పేరుంది. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఇప్పటికీ ఎవ్జీుఆర్ అంటే తమిళ ప్రజలకు ప్రాణం.