కాజల్ చాలా ఆనందంగా ఉంది. కొంత విరామం తర్వాత సక్సెస్ సినిమాలో నటించింది. పాత్రకి ప్రాధాన్యత లేనప్పటికీ, సూపర్ హిట్ సినిమాలో నాయికగా క్రేజ్ తెచ్చుకుంది. ఖైదీ విజయం టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందా అంటే అనుమానమే.! ఎందుకంటే ఒక సీనియర్ హీరోతో నటించాక యువ నటుడు ఆమె కాంబినేషన్ లో సినిమా చేయడానికి ఆసక్తి చూపించకపోవచ్చు. ఇక కొంతకాలంగా కాజల్ పెళ్లి గురించి వినిపిస్తోంది. ఇప్పటికే మూడు పదుల వయస్సు దాటేసిన ఈ భామ తనకింకా పెళ్లి చేసుకునే వయసు రాలేదని చెప్పి ఆశ్చర్యపరిచింది. తనకంటే చిన్నదైన చెల్లి కి పెళ్లి వయసు వచ్చేసిందని నాలుగేళ్ల క్రితమే వివాహం చేసింది. కానీ తను మాత్రం పెళ్లి గురించి ఆలోచించడం లేదని, మరిన్ని సినిమాల్లో నటిస్తానని చెప్పింది. తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నట్టు వెళ్ళడించింది.