Advertisementt

మళ్లీ...చిరు బలనిరూపణ.. ?

Tue 17th Jan 2017 01:22 PM
chiranjeevi,thanks meet,hyderabad,chiranjeevi stamina,mega family  మళ్లీ...చిరు బలనిరూపణ.. ?
మళ్లీ...చిరు బలనిరూపణ.. ?
Advertisement
Ads by CJ

భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజులు తెలుగు టీవీ ఛానళ్ళు కొత్త సినిమాలపై మోత మోగించాయి. పండుగ రోజున టీవీలో వినోద కార్యక్రమాలు చూస్తూ ఎంజాయ్ చేద్దామని భావించిన కుటుంబాలు చిరంజీవి ఇంటర్య్వూలు  చూసి ఆనందించారు. సినిమా రిలీజ్ కు ముందే పిలిచి మరీ ఛానళ్ళకు ఇంటర్య్వూలు ఇచ్చిన చిరంజీవి పండుగ సందర్భంగా మరో చిట్ ఛాట్ చేశాడు. తమ్ముడి కూతురు నిహారికతో చేసిన ప్రోగ్రామ్ సీడీలను ఛానళ్ళకు పంపించి, ప్రసారం చేయించుకున్నారు. ఒకవైపు థియేటర్లలో  ఖైదీ సినిమా, టీవీల్లో  ఆయన ఇంటర్య్వూలు ఇలా మొత్తం చిరంజీవి మయం అయింది. మీడియాను తెలివిగా ఎలా వాడుకోవాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే విసుగు చెందకుండా అడిగినవారందరికీ ఇంటర్య్వూలు ఇచ్చారు. చిరంజీవి మేనియా జనం మధిలో ఎప్పటికప్పుడు కనిపించడంతో చాలా మంది సినిమా చూసేశారు. దీనికంటే ముందు ప్రీ రిలీజ్ వేడుక అంటూ గుంటూరులో జనం మద్య ఒక కార్యక్రమం జరిగింది. నాగబాబు వివాదస్పద వ్యాఖ్యలతో హైలెట్ అయింది. మొత్తానికి పక్కా ప్లానింగ్ తో అంతా జరిగింది. సినిమా సక్సెస్ అయింది. మంచి షేర్స్ వస్తున్నాయి. కేవలం వారం రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ కు చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. 

పదేళ్ళ విరామం తర్వాత తనకి ఘన స్వాగతం లభించడంతో ఇప్పుడు మరో కొత్త ప్రచారానికి తెరదీస్తున్నారు చిరంజీవి. థాంక్స్ మీట్ పేరుతో ఒక బహిరంగ సభ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇది మరోసారి బల నిరూపణ యత్నమే అని స్పష్టమవుతోంది. జనబలం చిరంజీవికి ఏ మాత్రం తగ్గలేదనే విషయాన్ని వెల్లడించాలని ఆయన కోటరి భావిస్తోంది. దీని వెనుక ఎలాంటి ఉద్దేశం ఉందనేది మాత్రం స్పష్టమవలేదు. ఇప్పటికే ఆంధ్రలో ఒక కార్యక్రమం.. థాంక్స్ మీట్ హైదరాబాద్ లో ఆ తర్వాత రాయలసీమలో మరో కార్యక్రమం నిర్వహించే ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ