'టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్'లతో మరలా యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ఊపందుకుంది. ఇందులో భాగంగా ఆయన కథలను, దర్శకనిర్మాతలను, బెస్ట్ టెక్నీషియన్స్‌ను అందుబాటులో ఉంచుకుంటూ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఎన్నో కథలను, దర్శకులను పరిశీలించిన ఆయన ఎట్టకేలకు 'పవర్' లాంటి హిట్, 'సర్దార్ గబ్బర్‌సింగ్' వంటి డిజాస్టర్ ఇచ్చిన యువదర్శకుడు బాబిని ఎంచుకున్నాడు. దాంతో ఎన్టీఆర్‌ను మెప్పించిన ఆ స్టోరీ ఎంత విభిన్నంగా ఉంటుందోనన్న ఆసక్తి అందరలోనూ మొదలైంది. ఇక ఈ చిత్రాన్ని ఆయన తొలిసారి తన అన్నయ్య నందమూరి కళ్యాణ్‌రామ్ సొంతబేనర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో చేస్తున్నాడు. ఇటీవలికాలంలో కేవలం 'పటాస్' చిత్రం తప్ప ఈ బేనర్‌లో వచ్చిన పలు చిత్రాలు కళ్యాణ్‌రామ్‌కు నిర్మాతగా భారీ నష్టాలనే మిగిల్చాయి. 'కిక్2' అయితే ఆయన్ను పూర్తిగా నష్టాలలోకి నెట్టింది. అయినా కూడా జయాపజయాలకు అతీతంగా చిత్రాలను నిర్మిస్తోన్న కళ్యాణ్‌రామ్ ఇప్పుడు భారీ బడ్జెట్‌తో ఎన్టీఆర్ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ చిత్రం తనకే కాకుండా తన తమ్ముడు ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలవాలని కళ్యాణ్ ఆరాటపడుతున్నాడు. అందులో భాగంగా ఆయన దేశవ్యాప్తంగా సినిమాటోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సీకె మురళీధరన్‌ను ఈ చిత్రానికి ఎంచుకున్నాడు. గతంలో ఈయన 'త్రీ ఇడియట్స్, పీకే, మొహంజదారో' వంటి చిత్రాలకు పనిచేసి ఉన్నాడు. 'పీకే' చిత్రానికి గానూ ఆయనకు ఎన్నో అవార్డులు కూడా లభించాయి. ప్రస్తుతం ఎన్నో బాలీవుడ్ కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్న ఆయనకు భారీ పారితోషికం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఓ హైలైట్‌గా నిలుస్తుందని అర్ధమైపోతోంది. ఇక ఇతర టెక్నీషియన్స్ నుంచి హీరోయిన్లు, ఇతర నటీనటులను కూడా ఆచితూచి అంటే ది బెస్ట్ ని ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో ప్రీపొడక్షన్ పనులు ఇంకా పూర్తవ్వకపోవడంతో చిత్రం ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్లేది తెలియడం లేదు. మరి కాస్త ఆలస్యమైనా కూడా ఈ చిత్రం తన బేనర్‌కు, ఎన్టీఆర్‌కు ప్రతిష్టాత్మకంగా నిలవాలనే పట్టుదలతో కళ్యాణ్, ఎన్టీఆర్ లు అస్సలు తగ్గట్లే అంటున్నారు.