Advertisementt

శాతకర్ణి కి అమెరికా అభిమానుల ఆహ్వానం..!

Mon 16th Jan 2017 10:44 PM
balakrishna,usa,gautamiputra satakarni,usa fans  శాతకర్ణి కి అమెరికా అభిమానుల ఆహ్వానం..!
శాతకర్ణి కి అమెరికా అభిమానుల ఆహ్వానం..!
Advertisement
Ads by CJ

రెండు తెలుగు రాష్ట్రాల్లో గౌతమిపుత్ర శాతకర్ణి బాక్సాఫీస్ విజయాన్ని దక్కించుకుంది. శాతవాహనుడి కథని కళ్ళకు కట్టినట్టుగా ఆవిష్కరించిన ఈ చిత్రానికి విదేశాల్లో సైతం అదే స్పందన లభిస్తోంది. తొలిసారి బాలకృష్ణ వన్ మినియన్ మార్క్ దాటేశారు. దీంతో ఎన్ ఆర్ ఐ అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. తెలుగు రాష్ట్రాలకు దూరంగా ఉండిపోయిన అభిమానులు తెలుగు వీరుడు కథని ఆస్వాదిస్తున్నారు. అంతే కాదు తమ ఆనందాన్ని బాలకృష్ణతో షేర్ చేసుకోవాలని ముచ్చటపడ్డారు. వారి ఆహ్వానాన్ని మన్నించి బుధవారం బాలయ్య అమెరికా వెళుతున్నట్టు సమాచారం. అక్కడ మూడు రోజులు బస చేస్తారు. శాతకర్ణి విజయోత్సవంలో పాల్గొంటారు. బాలకృష్ణ రాకతో విదేశీ మార్కెట్ లో శాతకర్ణికి మరింత కలక్షన్లు పెరుగుతాయని, రెండు మినియన్ మార్క్ కు చేరుకుంటుందని భావిస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ