అగ్రహీరోతో సినిమా తీసి దర్శకుడిగా పేరు తెచ్చుకోవడం కొంత కష్టమే. ఎందుకంటే స్టార్ హీరోలకే సక్సెస్ క్రెడిట్ వెళుతుంది. కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే దర్శకుడు సెహభాష్ అనిపించుకుంటాడు సరిగ్గా అదే జరిగింది క్రిష్ కు. అఖండభారతాన్ని ఏకం చేసిన శాతవాహనుడి కథని అద్భుతంగా తెరకెక్కించి, విజయం సాధించిన ఘనత క్రిష్ కు చెందుతుంది. చరిత్రలో నిలిచిపోయే చిత్రమని ప్రశంసలు అందుకున్న గౌతమిపుత్ర శాతకర్ణి మేకర్ గా క్రిష్ కు పేరు వచ్చింది. ఇప్పుడు ఆయన ఎలాంటి కథను అయినా సరే సునాయసంగా తీయగలరని అంటున్నారు. దాంతో క్రిష్ కు స్టార్ డైరెక్టర్ హోదా వచ్చేసింది. ఇప్పుడు క్రిష్ తో కలిసి సినిమా చేయడానికి చాలా మంది స్టార్స్ అసక్తి చూపుతున్నారు. సరైన హిట్ కోసం చూస్తున్న హీరోలు ఇప్పటికే ఈ విషయమై సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. చిరంజీవి కంపౌండ్ నుండి కబురు వెళ్ళిందని ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబు, జూ.ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి హీరోలు సైతం క్రిష్ తో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు.