సింప్లిసిటీ నుంచి ప్రతి విషయంలోనూ పవన్‌కు, మహేష్‌కు ఎన్నో పోలికలు ఉన్నాయి. ఇక సినిమాల పరంగా క్రేజ్, ఇమేజ్‌ల వంటి వాటిల్లో కూడా ఇద్దరిది ఒకే రేంజ్. హిట్టులిచ్చినా, ఫ్లాప్‌లిచ్చినా కూడబలుక్కుని ఇస్తున్నట్లు ఉండటం యాదృచ్చికం. వీరి గత చిత్రాలైన 'సర్దార్‌గబ్బర్‌సింగ్, బ్రహ్మోత్సవం' చిత్రాలు డిజాస్టర్స్‌గా నిలిచినా కూడా వారి తదుపరి చిత్రాలపై మాత్రం ఆ ప్రభావం ఏమాత్రం లేదు. పవన్ నటిస్తున్న 'కాటమరాయుడు', మహేష్ చేస్తోన్న మురుగదాస్ చిత్రాలపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. కాగా వీరిద్దరు మరోసారి ఒకే బాటలో పయనిస్తున్నారా? అనే సందేహానికి మరోసారి తెరలేచింది. వాస్తవానికి పవన్, మహేష్‌ల తాజా చిత్రాలు రెండు మొదట దసరా కానుకగా ఫస్ట్‌లుక్‌లు వస్తాయని చెప్పారు. ఆ తర్వాత జనవరి1న మహేష్ చిత్రం టైటిల్, ఫస్ట్‌లుక్ ఖాయమన్నారు. ఈ విషయంలో మహేష్ కంటే పవన్ కాస్త బెటర్. ఆయన చిత్రం టైటిల్‌తో పాటు మోషన్ పోస్టర్, ప్రీలుక్‌లు, ఫస్ట్‌లుక్‌లు వచ్చాయి. కానీ మహేష్ చిత్రం టైటిల్ మాత్రం ఇంకా ఖరారు కాకపోవడం, పలు పేర్లు వార్తల్లో నిలుస్తున్నప్పటికీ దీనిపై క్లారిటీ లేకపోవడం ఆయన అభిమానులను కాస్త నిరాశపరిచిందనే చెప్పాలి. ఇక వీరిద్దరి టీజర్లు కనీసం సంక్రాంతి పండుగనాడైనా వస్తాయని అందరూ ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ ఇద్దరు కూడబలుక్కున్నట్లు తమ చిత్రాల టీజర్లను రిపబ్లిక్‌డే సందర్భంగా జనవరి 26న ఒకే రోజు విడుదల దాదాపు చేయడం ఖాయమైందంటున్నారు. మరి ఈసారైనా ఇద్దరు మాట నిలుపుకుంటారా? లేక లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా వస్తామని మరలా వాయిదా వేస్తారా? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.