చిరంజీవి 'ఖైదీ...' సినిమా వీక్షించినట్టు, బావుందంటూ పవన్ ప్రశంసించినట్టు వార్తలు వచ్చాయి. చాలా విరామం తర్వాత వచ్చిన అన్నయ్య సినిమాను తమ్ముడు చూడడం, బావుందని చెప్పడం బానే ఉంది. అసలు పవన్ ఈ సినిమాను ఎక్కడ, ఎప్పుడు చూశారు? అని కొందరికి అనుమానం వస్తోంది. 'ఖైదీ...' చిత్రాన్ని రీలీజ్ కు ముందు అంటే ప్రివ్యూ చూడలేదనేది తెలిసిందే. ఇక రిలీజ్ అయ్యాక పవన్ థియేటర్ కు వెళితే కచ్చితంగా తెలుస్తుంది. మీడియాకు తెలిసి వెళ్ళకున్నా థియేటర్ లో ప్రేక్షకులతో కలిసి చూస్తే ఆ విషయం సోషల్ మీడియా ద్వారా బహిరంగమవుతుంది. 'ఖైదీ...' రిలీజ్ సమయంలో హైదరాబాద్ లోనే ఉన్నందున పవన్ ఇక్కడే చూడాలి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు అలాంటిది జరగలేదు. మరి నిర్మాత శరద్ మరార్ తో కలిసి చూసినట్టు పవన్ ఎందుకని ప్రకటించారు. లేదా థియేటర్లలో తనని గుర్తుపట్టని విధంగా జాగ్రత్తలు తీసుకున్నారా? లేక ఇంట్లోనే సినిమా చూసే వీలు ఆయనకు ఉందా అనేది స్పష్టం కావాలి. లేదంటే కేవలం అభిమానులను సంతృప్తి పరచడం కోసం, విమర్శలకు తావుకల్పించకుండా ఉండేందుకని చూసినట్టు చెప్పారా? అనే డౌట్ చాలామందిలో ఉంది.