Advertisementt

ఈ భామని మెప్పించడం కష్టం బాబోయ్‌!

Sat 14th Jan 2017 04:41 PM
sai pallavi,premam movie,fidha movie,sekhar kammula,sai pallavi in manjula movie  ఈ భామని మెప్పించడం కష్టం బాబోయ్‌!
ఈ భామని మెప్పించడం కష్టం బాబోయ్‌!
Advertisement
Ads by CJ

మలయాళ 'ప్రేమమ్‌'తో పాపులర్‌ అయిన హీరోయిన్‌ సాయిపల్లవి. దీని తర్వాత ఆమెకు దక్షిణాదిలోని భాషలన్నింటిలో ఎన్నో అవకాశాలు వచ్చినా నో చెప్పింది. మణిరత్నం, గౌతమ్‌మీపన్‌లను కూడా కాదంది. దీంతో ఆమె ఎక్కువ రెమ్యూనరేషన్‌ అడుగుతోందంటూ విమర్శలు వచ్చాయి. కానీ ఆమె మాత్రం తాను గ్లామర్‌షో చేయనని, సినిమాలో నిండుగా కనిపించే పాత్రలతో పాటు ఆ పాత్రకు సినిమాలో మంచి ప్రాముఖ్యం ఉండాలని పట్టుపడుతోంది. కాగా ఈ అమ్మడు ప్రస్తుతం శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌ నటిస్తోన్న 'ఫిదా'లో చేస్తోంది. తాజాగా ఆమె మరో తెలుగు చిత్రానికి కూడా ఆమె గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. నటిగా, నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న సూపర్‌స్టార్‌కృష్ణ కూతురు, మహేష్‌ సోదరి మంజుల దర్శకత్వం వహించే ఈ చిత్రంలో సందీప్‌కిషన్‌ హీరోగా నటిస్తుండగా, సాయిపల్లవి హీరోయిన్‌ పాత్రకు సైన్‌చేసింది. అర్బన్‌లవ్‌స్టోరీగా రూపొందే ఈ చిత్రంలో హీరో సందీప్‌ కూడా కొత్తలుక్‌లో కనిపించనున్నాడు. ఫిబ్రవరి నుండి సెట్స్‌పైకి వెళ్లే ఈ చిత్రాన్ని జెమిని కిరణ్‌ నిర్మిస్తుండటం విశేషం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ