Advertisementt

'ఖైదీ...' చిత్రంపై అసలు దర్శకుని అసహనం!

Sat 14th Jan 2017 03:44 PM
khaidi no 150,kathi,murugadoss,vv vinayak  'ఖైదీ...' చిత్రంపై అసలు దర్శకుని అసహనం!
'ఖైదీ...' చిత్రంపై అసలు దర్శకుని అసహనం!
Advertisement
Ads by CJ

చిరు నటించిన తాజా చిత్రం 'ఖైదీ...' చిత్రానికి మూలం మురుగదాస్‌ తీసిన బ్లాక్‌బస్టర్‌ 'కత్తి' అనే సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి ఆయనే స్క్రిప్ట్‌ను, స్క్రీన్‌ప్లేని అందించాడు. ప్రస్తుతం ఆయన మహేష్‌తో చేస్తున్న చిత్రం కోసం హైదరాబాద్‌లోనే ఉన్నాడు. కాగా ఆయన తన 'కత్తి' రీమేక్‌ కావడంతో 'ఖైదీ' చిత్రాన్ని చూశాడు. సినిమా అంతా బాగానే ఉన్నా అందులోని కొన్ని సీన్లు మాత్రం ఆయనకు కోపం తెప్పించాయట. మురుగదాస్‌కు లిక్కర్‌ అంటే పడదు. తన సినిమాలలో హీరో, విలన్లు సహా ఏ క్యారెక్టర్‌ను ఆయన మద్యం తాగుతున్నట్లు చూపించడు. ఆయన అంత పక్కాగా తన సినిమాలలో మద్యనిషేధం పాటిస్తాడు. విలన్లు సైతం కాఫీ, టీ వంటివి తాగుతూ కనిపిస్తారు. కాగా 'కత్తి' చిత్రంలో కూడా విలన్‌ కేవలం గ్రీన్‌టీ తాగుతూ మాత్రమే కనిపించాడు. కానీ 'ఖైదీ' చిత్రంలో ఓ కామెడీ ట్రాక్‌ మొత్తం మందుకొట్టే సీన్లతోనే నడుస్తుంది. స్వయంగా హీరో, కమెడియన్‌తో కలిసి మందు తాగుతున్నట్లు చూపించిన సన్నివేశంతో పాటు అలీకి ఆడవేషం వేసి చూపించిన సీన్స్‌ పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడట. కానీ మిగతా సినిమా బాగానే ఉందని, ముఖ్యంగా చిరంజీవి అదరగొట్టాడని ప్రశంసించాడట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ