Advertisementt

పూరీ...'అక్కుపక్షి' ప్రయోగం ఎప్పుడో..?

Fri 13th Jan 2017 11:35 PM
puri jagannadh,akkupakshi,ks ramarao,mohan babu,nagababu  పూరీ...'అక్కుపక్షి' ప్రయోగం ఎప్పుడో..?
పూరీ...'అక్కుపక్షి' ప్రయోగం ఎప్పుడో..?
Advertisement
Ads by CJ

సినిమాల టైటిల్స్‌లో, డైలాగ్స్‌లో తిట్లని కూడా చెప్పించి, చూపించగలగడంలో పూరీ తర్వాతే ఎవరైనా..! కాగా గతంలో మోహన్‌బాబు లెజెండ్‌ అనే వివాదాస్పదంపై స్పందిస్తూ, నిర్మాత కె.యస్‌.రామారావును 'సిల్లీ..ఫెలో' అని అనడంతో ఆ పదం బాగా ట్రెండీగా మారింది. ఇక అదే కెయస్‌రామారావు పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నిర్మించిన 'బుజ్జిగాడు మేడిన్‌చెన్నై' చిత్రంలో మోహన్‌బాబును పెట్టుకొని 'సిల్లీఫెల్లో' అనే దాన్ని ఆయన నోటితో ఊతపదంగా చెప్పించిన ఘనుడు పూరీ. కాగా అప్పుడప్పుడు సెలబ్రిటీలు మాట్లాడే పలు పదాలు ట్రెండీగా మారుతాయి. ఇక తాజాగా 'ఖైదీ...' చిత్రం ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌లో రాంగోపాల్‌వర్మ గురించి నాగబాబు వాడిన తిట్టు 'అక్కుపక్షి' పదం ఇప్పుడు అందరి నోళ్లలో నానుతోంది. మొత్తానికి మంచి మంచి తిట్లను కూడా మన సెలబ్రిటీలు అందరికీ ఊతపదాలుగా అలవాటు చేస్తున్నారనే సెటైర్లు వినపడుతున్నాయి. కాబట్టి ఇంత కొత్త కొత్త పదాలను పాపులర్‌ చేసే బాధ్యతను తీసుకుంటున్న అందరికీ మన ప్రేక్షకదేవుళ్లు రుణపడి ఉంటారనే చెప్పాలి..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ