సాధారణంగా అమెరికాలో సినిమా టికెట్ ధర 9.15డాలర్లు. కానీ చిరు రీఎంట్రీ మూవీకి రేటును 25డాలర్లకు పెంచారు. దాంతో ఈ చిత్రం కొన్న డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండుతుందని అందరూ భావించారు. చిరు రీఎంట్రీ ఫిల్మ్ కాబట్టి ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని భావించారు. కానీ జర్మనీకి చెందిన ఓ సుప్రసిద్ద టెలికమ్యూనికేషన్ సంస్థ అమెరికాలో తన మార్కెట్‌ను పెంచుకోవాలని భావించి, తమ వినియోగదారులకు కేవలం 2డాలర్లకే సినిమా టిక్కెట్లు ఇస్తామని ప్రకటించింది. దీంతో అక్కడ ప్రవాస తెలుగువారు చిరు చిత్రాన్ని ఒక్కో టికెట్‌ను 2 డాలర్లకే ఎగబడి కొన్నారు. ఇక ఆ కమ్యూనికేషన్ సంస్థ నిబంధన ప్రకారం తమ వినియోగదారులకు 2డాలర్లకే సినిమాను చూపించి, అసలు ధర అయిన 9.15డాలర్లలో 2డాలర్లుపోగా మిగిలిన 7.15డాలర్లను ఆయా డిస్ట్రిబ్యూటర్లకు ఆ కంపెనీ చెల్లిస్తుంది. అయినా కూడా ఈ చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తమ చిత్రానికి పెంచిన 25డాలర్లలో 2 డాలర్లు పోను మిగిలిన 23డాలర్లను ఆ సంస్థ చెల్లిస్తుందేమోనని ఆశపడ్డారు. కానీ న్యాయపరంగా పెంచిన రేటుతో సంస్థకు సంబంధం లేనందున కేవలం టికెట్‌కు 7.5 డాలర్లు మాత్రమే చెల్లిస్తామని సదరు కంపెనీ డిసైడ్ అయింది. దీంతో 'ఖైదీ...' డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు 5కోట్ల వరకు నష్టం తప్పలేదు. చిరు 'శంకర్‌దాదా..' చిత్రంలో చెప్పే ఎంకి పెళ్లి.. సుబ్బి చావుకొచ్చిందనే సామెత దీనికి సరిగ్గా సూట్ అయ్యేలా కనిపిస్తోంది.