Advertisementt

జక్కన్న ప్రశంసల వర్షం...!

Fri 13th Jan 2017 04:07 PM
rajamouli,praises,khaidi no 150,gautamiputra satakarni,ghazi  జక్కన్న ప్రశంసల వర్షం...!
జక్కన్న ప్రశంసల వర్షం...!
Advertisement
Ads by CJ

దాదాపు పదేళ్ల తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 150వ చిత్రం చూసిన జక్కన్న.. చిరును చాలాకాలంగా మిస్‌ అవుతున్నామని, సినిమా సూపర్‌గా ఉందని చెప్పి, ఈ చిత్రాన్ని వినాయక్‌ మాత్రమే సరిగ్గా హ్యాండిల్‌ చేయగలిగాడంటూ నిర్మాతగా మారిన చరణ్‌ను కూడా పొగడ్తలతో ముంచెత్తాడు. ఇక 'గౌతమీపుత్ర శాతకర్ణి'చిత్రం చూసి 'సాహో... బసవతారకరామపుత్ర బాలయ్య' అంటూ ప్రశంసలు కురిపించాడు. ఈ చిత్రాన్ని 12కోట్ల మంది తెలుగువారు గర్వపడేలా తీశారని, క్రిష్‌ నుంచి తాను నేర్చుకోవలసింది చాలా ఉందని, కేవలం 79 రోజుల్లో చిత్రాన్ని తీశారంటే ఆశ్చర్యంగా ఉందంటూ తన స్పందనను తెలిపాడు. అదే సమయంలో కొత్తదర్శకుడు సంకల్ప్ డైరెక్షన్‌లో రానా హీరోగా రూపొందుతున్న 'ఘాజీ' చిత్రం తాజా ట్రైలర్‌పై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. మనం కూడా ఇలాంటి చిత్రాలను తీయాలని భావిస్తున్నానని, ఈ ట్రైలర్‌ అద్భుతంగా ఉందంటూ పొగిడారు. సాధారణంగా రాజమౌళి ఓ చిత్రాన్ని పొగిడాడంటే ఆ చిత్రం సూపర్‌హిట్టు కిందే లెక్క వేస్తారు. ఆయన జడ్జిమెంట్‌పై ఆడియన్స్‌కు అంత నమ్మకం ఉంది, దీన్నిబట్టి 'ఖైదీ..', 'గౌతమీపుత్ర....' చిత్రాలు కూడా మంచి విజయం సాధించడం ఖాయమనే సంగతి అర్ధమవుతోంది. ఇక ఫిబ్రవరి17న రానున్న 'ఘాజీ' చిత్రంపై కూడా అంచనాలు పెరిగాయి. దిల్‌రాజు నిర్మించిన 'శతమానం భవతి' కూడా చాలా బాగుందని ఇన్‌సైడ్‌టాక్‌ వస్తున్న నేపథ్యంలో రేపు విడుదలయ్యే ఈ చిత్రంపై కూడా జక్కన్న కనుక ప్రశంసలు కురిపించాడంటే ఈ ఏడాది టాలీవుడ్‌కు అద్భుతమైన శుభారంభం లభించిందనే చెప్పాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ