Advertisementt

సూపర్‌స్టార్‌.. ఎన్టీఆర్‌ను వాడుకుంటున్నాడా..?

Fri 13th Jan 2017 03:49 PM
mohanlal,jr ntr,oppam,kanupapa  సూపర్‌స్టార్‌.. ఎన్టీఆర్‌ను వాడుకుంటున్నాడా..?
సూపర్‌స్టార్‌.. ఎన్టీఆర్‌ను వాడుకుంటున్నాడా..?
Advertisement
Ads by CJ

పవన్‌, మహేష్‌, ఎన్టీఆర్‌ వంటి వారు ఓ చిత్రం ఆడియో వేడుకకు వస్తే దానికి లభించే ప్రమోషన్‌, తద్వారా ఆ చిత్రానికి మంచి క్రేజ్‌ రావడం ఖాయమనేది అందరూ ఒప్పుకుంటారు. అందుకే చాలా మంది చిన్న చిత్రాల మేకర్స్‌ వారిని ఎలాగైనా తమ వేడుకలకు రప్పించుకోవాలని ఆరాటపడుతుంటారు. ఇక విషయానికి వస్తే త్వరలో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ అంధునిగా నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ 'ఒప్పం' అక్కడ ఘనవిజయం సాధించింది. ఈచిత్రం పలు భాషల్లో రీమేక్‌ కానుంది. కానీ తెలుగులో మాత్రం ఈ చిత్రాన్ని 'కనుపాప' పేరుతో డబ్‌ చేస్తున్నారు. తెలుగులో తాజాగా ఎన్టీఆర్‌ నటించిన 'జనతాగ్యారేజ్‌'తో ప్రేక్షకులను మెప్పించి, 'మనమంతా' చిత్రంతో ఇక్కడ కూడా మంచి గుర్తింపును పొందిన మోహన్‌లాల్‌ ఈ చిత్రాన్ని బలవంతంగా తెలుగులోకి డబ్బింగ్‌ చేస్తున్నాడు. ఈ చిత్రం ఆడియో వేడుక ఈనెల 25న జరగనుంది. మోహన్‌లాల్‌ ఈ చిత్రం ఆడియోకు యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ను ఆహ్వానించి, తనకున్న పరిచయంతో ఆయన్ను వేడుకకు రప్పించే పనిలో ఉన్నాడట. మొత్తానికి ఎన్టీఆర్‌ ఈ డబ్బింగ్‌ చిత్రం ఆడియోకు వస్తే దీనికి మంచి క్రేజ్‌ రావడం ఖాయం. కాగా దిగ్రేట్‌ డైరెక్టర్‌ ప్రియదర్శన్‌ ఈ చిత్రానికి దర్శకుడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ