మూడున్నర దశాబ్దాల నటజీవితం, 150 సినిమాల అనుభవం. సాధారణ నటుడిని మెగాస్టార్ స్థాయికి చేర్చిన జనం. టాలీవుడ్ లో ఉన్నతస్థానం. ఇవి చిరంజీవి సొంతం. తెలుగు ప్రేక్షకుల అభిమాన నటుడిగా కీర్తిగడించిన మెగాస్టార్ ఇప్పుటికైనా వాస్తవం గ్రహిస్తారా? అభిమానులకు కులం ఉండదని తెలుసుకుంటారా?. తమ అభిమాన నటుడు కులం జంఢా పట్టుకున్నా, అభిమానులు మాత్రం పట్టించుకోలేదు. ఆయనను నటుడిగా అభిమానిస్తున్నారు. చిరంజీవి తాజా చిత్రం ఖైదీ..ని ప్రాంతాలు, కులాలకు అతీతంగా ఆదరించి, అభిమాన వర్షం కురిపించారు. ఇవి చిరంజీవిలో మార్పుకు బీజం వేస్తాయా? అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
కళాకారుడు కులాలకు, ప్రాంతాలకు అతీతం. ఈ విషయం చిరంజీవి తెలియంది కాదు. అయినప్పటికీ ఆయన కేవలం ఒక కులానికి అన్యాయం జరిగిందంటూ పోరుబాట పట్టారు. కాపునాడు నేతలతో కలిశారు. చిరంజీవి వంటి స్టార్ వెంట కులం మాట వినిపించడంతో అభిమానులు అవాక్కయ్యారు. ఆదర్శంగా నిలవాల్సిన నటుడు, సినిమాల ద్వారా సందేశాలు అందిస్తూ, తను మాత్రం ఒక కులం జండా మోయడం విమర్శలకు తావిచ్చినట్టు అయింది. ఓటు రాజకీయంలో ఆయన కూడా పావుగా మారారనే నిందను మూఠగట్టుకున్నారు. రాజకీయంగా కులం కావాలన్నారు. నటుడిగా మాత్రం అందరూ కావాలట. కేవలం ఒక కులం చూస్తేనే తన సినిమా సక్సెస్ అయిందా? అనే విషయాన్ని గుర్తిస్తే మంచిది.
ఇప్పటికైనా చేసిన తప్పిదాన్ని తెలుసుకుని కులాలకు అతీతంగా తన భవిష్యత్తు ప్రణాళిక వేసుకుంటారా? అభిమానులు కూడా ఆశిస్తున్నది అదే. మరి చిరుగారూ మీరు మారుతారా?