Advertisementt

రేసుగుర్రంలా మారిన మెగాస్టార్‌...!

Tue 10th Jan 2017 06:07 PM
mega star chiranjeevi,khaidi no 150 movie,chiru 151 movie,director surender reddy,chiru 152 movie,director boyapati srinu  రేసుగుర్రంలా మారిన మెగాస్టార్‌...!
రేసుగుర్రంలా మారిన మెగాస్టార్‌...!
Advertisement
Ads by CJ

హీరోగా 9ఏళ్ల తర్వాత రీఎంట్రీ చేయాలని నిర్ణయించుకున్న మెగాస్టార్‌ చిరంజీవి తన 150వ చిత్రం కథ, దర్శకుల విషయంలో నాన్చి.. నాన్చి.. చివరకు 'కత్తి' రీమేక్‌ను వినాయక్‌తో చేశాడు. అలా రూపొందిన 'ఖైదీనెంబర్‌150' చిత్రం మరికొన్ని గంటల్లో థియేటర్లకు రానుంది. ఇక ఈ చిత్రం తర్వాత మాత్రం చిరు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చకచకా తన తదుపరి రెండు చిత్రాలను లైన్‌లోకి తేవాలని డిసైడ్‌ అయ్యాడు. ఈ రెండు చిత్రాలను ఆయన ఇదే ఏడాది ప్రారంభించనున్నానని తెలపడంతో మెగాభిమానులు ఉప్పొంగిపోతున్నారు. తనపై వెరైటీ చిత్రాలను చేయడు.. అనే విమర్శకు, బాలయ్య మాత్రమే 'గౌతమీపుత్ర....' వంటి హిస్టారికల్‌ చిత్రాలను చేయగలడని వస్తున్న విమర్శలకు చిరు తన 151వ చిత్రంతో ఫుల్‌స్టాప్‌ పెట్టడానికి డిసైడ్‌ అయ్యాడనిపిస్తోంది. ఎప్పటి నుంచో ఆయన తాను చేయాలని భావిస్తున్న 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రం విషయంలో ఆల్‌రెడీ పరుచూరి బ్రదర్స్‌తో కలిసి డిస్కషన్స్‌ కూడా పూర్తయ్యాయని తెలిపాడు. తన తదుపరి చిత్రం కోసం సురేందర్‌రెడ్డి ఓ స్క్రిప్ట్‌ను తయారు చేస్తున్నాడని, ఆ స్టోరీ కనుక తనకు నచ్చకపోతే, సురేందర్‌రెడ్డికే 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' దర్శకత్వ బాధ్యతను అప్పగిస్తానని స్పష్టం చేశాడు. ఈ చిత్రానికి తన కుమారుడు చరణే నిర్మాతగా ఉంటాడని ప్రకటించిన ఆయన తన 152వ చిత్రాన్ని అల్లు అరవింద్‌ నిర్మాతగా గీతాఆర్ట్స్‌ బేనర్‌లో చేస్తానన్నాడు. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తాడని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం బోయపాటి మరో చిత్రంతో బిజీగా ఉన్నాడని, ఆ చిత్రం పూర్తయిన తర్వాత తన స్క్రిప్ట్‌కు కొంత సమయం కావాలని కోరాడని తెలిపాడు. ఈ చిత్రం సెప్టెంబర్‌లో పట్టాలెక్కనుందని ఆయన తెలపడం మెగాభిమానులకు తీయటి వార్తే అని చెప్పవచ్చు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ