Advertisementt

నైస్ గా తప్పించేశాడుగా...!

Tue 10th Jan 2017 05:03 PM
hero suriya,vikram,tamil director gautam menen,dhruva nakshantram movie  నైస్ గా తప్పించేశాడుగా...!
నైస్ గా తప్పించేశాడుగా...!
Advertisement
Ads by CJ

తమిళ డైరెక్టర్ గౌతమ్ మీనన్ కి -  తమిళ హీరో సూర్య కి గత కొద్దీ కాలంగా విభేదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు వీరి కాంబినేషన్ లో  'కాక్క కాక్క’ , ‘వారణమ్‌ ఆయురం’ వంటి సూపర్‌ హిట్ మూవీస్ వచ్చాయి. ఇక వీరి కాంబినేషన్ లో మరో చిత్రం తెరకెక్కాల్సిన సమయంలో వీరి మధ్యన విభేదాలు చోటు చేసుకున్నాయి. అసలు వీరి కాంబినేషన్ లో మూడవ చిత్రంగా 'ధృవ నక్షత్రం' చిత్రాన్ని తెరకెక్కించడానికి టైటిల్ తో సహా అన్నిఏర్పాట్లు జరిగిపోయాయి. కానీ డైరెక్టర్ గౌతమ్ మీనన్ మాత్రం వేరే పనుల్లో బిజీ అయిపోయి సూర్య చిత్రం ధృవ నక్షత్రాన్ని పక్కన పెట్టేసాడు. ఇక సూర్య ఆ చిత్రం గురించి చూసి చూసి చిరాకొచ్చి గౌతమ్ పై కోపంతో ప్రెస్ మీట్ పెట్టి మరీ 'నేను గౌతమ్ మీనన్ సినిమాలో నటించడం లేదని... ఆ సినిమా నుండి తప్పుకుంటున్నాని' చెప్పాడు. ఇక అప్పటినుండి వారి మధ్యన ఎలాంటి సంబంధాలు లేకుండా గ్యాప్ మెయింటింగ్ చేస్తూ వస్తున్నారు. ఇక సూర్య మళ్ళీ ఇన్నాళ్లకు రియలైజ్ అయ్యి గౌతమ్ మీనన్ కి క్షమాపణ కూడా చెప్పేసాడు. కానీ గౌతమ్ మాత్రం అప్పుడు ఇప్పుడు ఏమి స్పందించలేదు.

ఇక ఇప్పుడు గౌతమ్ మీనన్ సూర్యతో తియ్యాల్సిన 'ధృవ నక్షత్రం' చిత్రాన్ని చియాన్ విక్రమ్ హీరో గా తెరకెక్కిస్తున్నాడు. అనుకున్నదే తడువుగా ఆ సినిమాకి పూజా కార్యక్రమాలు జరిపించి.... పనిలో పనిగా ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసేసాడు. ఇక ఈ చిత్రం 2017  ఆగష్టు లో విడుదల చేస్తామని విడుదల డేట్ ని కూడా ప్రకటించి సూర్య కి షాక్ ఇచ్చాడు. అయితే సూర్యతో వచ్చిన విభేదాల కారణంగానే సూర్యతో అనుకున్న కథని ఇప్పుడు విక్రమ్ తో  ధృవ నక్షత్రాన్ని గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తున్నాడని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. అయినా సూర్య ఓపెన్ గా క్షమాపణ చెప్పినా కూడా స్పందించకుండా సైలెంట్ గా విక్రమ్ తో సినిమా మొదలుపెట్టేశాడు గౌతమ్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ