Advertisementt

చరణ్ ఫ్రెండ్..ఎన్టీఆర్ సినిమాపై కామెంట్స్..!

Tue 10th Jan 2017 02:41 PM
ram charan,dhruva,navdeep,baadshah movie,jr ntr  చరణ్ ఫ్రెండ్..ఎన్టీఆర్ సినిమాపై కామెంట్స్..!
చరణ్ ఫ్రెండ్..ఎన్టీఆర్ సినిమాపై కామెంట్స్..!
Advertisement
Ads by CJ

'ధృవ' సినిమాలో రామ్ చరణ్ కి ఫ్రెండ్ కేరెక్టర్ లో నటించిన నవదీప్ ఆ చిత్రంలోని నటనకు మంచి పేరు కొట్టేసాడు. ఇంతకుముందు నవదీప్ కొన్ని చిత్రాలలో హీరోగా చేసినా కూడా అవి పెద్దగా హిట్ అవ్వక కొన్ని సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తూ ప్రముఖ ఛానెల్ లో ఒక రియాలిటీ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తూ అలా... అలా కెరీర్ ని లాగించేస్తున్నాడు. అయితే రామ్ చరణ్ కి మంచి స్నేహితుడు కావడంతో నవదీప్ కి 'ధృవ' చిత్రంలో మంచి కేరెక్టర్ని ఇచ్చి ఎంకరేజ్ చేసాడు చరణ్. ఇక ఈ చిత్రంలో చరణ్ కి సపోర్టింగ్ కేరెక్టర్ లో నవదీప్ నటన పలువురు ప్రశంసలను అందుకుంటుంది. అయితే ఇప్పుడు 'ధృవ' ఇచ్చిన విజయంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో 'బాద్ షా'లో చేసిన కేరెక్టర్ గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. అసలు నేను 'బాద్ షా'లో అలా విలన్ కేరెక్టర్ లో నటించకుండా ఉండాల్సిందని.... ఆ స్టోరీ విన్నప్పుడు ఆ కేరెక్టర్ తనకి మంచి పేరు తీసుకువస్తుందని భావించి ఆ కేరెక్టర్ ఒప్పుకున్నానని అంటున్నాడు. ఇక సినిమా విడుదలైనాక అనవసరంగా నేను ఈ సినిమాలో నటించానేమో అని ఫీల్ అయ్యానని అంటున్నాడు. అయితే ఆర్య 2  లో నెగెటివ్ షేడ్స్ వున్న కేరెక్టర్ లో చేసినా ఆ సినిమాలో తనకి మంచి పేరొచ్చిందని చెబుతున్నాడు. అయితే అలాంటి రోల్స్ గనక వస్తే తప్పక చేస్తానని అంటున్నాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ