Advertisementt

ట్రెండ్‌ను ఫాలో అవుతోన్న నాని..!

Mon 09th Jan 2017 05:36 PM
hero nani,producer dilraj,director nakkini trinaath,heroine keerthy suresh,nenu local movie  ట్రెండ్‌ను ఫాలో అవుతోన్న నాని..!
ట్రెండ్‌ను ఫాలో అవుతోన్న నాని..!
Advertisement
Ads by CJ

నానిది భిన్నమైన శైలి.. తనదైన కొన్ని విభిన్నపాత్రలు, చిత్రాలు చేస్తూ యంగ్‌హీరోల్లో ఒక కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాడు. కానీ ఇప్పుడు తన తాజా చిత్రం 'నేను...లోకల్‌' విషయంలో మాత్రం ఆయన కూడా ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాడు. ప్రస్తుతం ఆడియోలను గ్రాండ్‌గా రిలీజ్‌ చేయకుండా ఒక్కో పాటను రిలీజ్‌ చేస్తూ, డైరెక్ట్‌గా పాటలను విడుదల చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మెగాప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ దీనికి తన కుమారుడు, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటించిన 'సరైనోడు' చిత్రంతో నాంది పలికాడు. సెంటిమెంట్‌గా ఈ చిత్రం మంచి విజయం సాధించి, బన్నీ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత రామ్‌చరణ్‌ నటించిన 'ధృవ', మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 'ఖైదీ నెంబర్‌ 150' చిత్రాలు ఇదే రూటును ఫాలో అయ్యాయి. మెగా హీరోలు తెరదీసిన ఈ ట్రెండ్‌ను ప్రస్తుతం నేచురల్‌ స్టార్‌ నానితో పాటు సుప్రసిద్ద నిర్మాత దిల్‌రాజులు కూడా ఫాలో అవుతున్నాడు. ప్రస్తుతం దిల్‌రాజు నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా, కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా 'నేను...లోకల్‌' చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ చిత్రానికి 'సినిమా చూపిస్త మామా' దర్శకుడు నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వాస్తవానికి క్రిస్మస్‌ కానుకగా కిందటి ఏడాది డిసెంబర్‌23న రిలీజ్‌ చేయాలని భావించారు. కానీ పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు ఆలస్యం అవుతున్నాయని భావించి జనవరి26కు వాయిదా వేశారు. కానీ ఈ చిత్రం వాయిదాపడటానికి పోస్ట్‌ప్రొడక్షన్‌ వర్క్‌ లేటుకావడం కారణం కాదని, ఈ చిత్రంలోని పలు సన్నివేశాలను రీషూట్‌ చేస్తుండటం వల్లే ఇలా జరుగుతోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రానికి కూడా ఆడియో వేడుక జరపకుండా నేరుగా మార్కెట్‌లోకి పాటలను విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రంలోని 'నెక్ట్స్‌ఏంటి....' అనే పాటను మార్కెట్‌లోకి విడుదల చేస్తామని చెప్పి, చివరిక్షణంలో దానిని ఈనెల 12కు వాయిదా వేశారు. దీనికి ఓ సర్‌ప్రైజ్‌ కారణం ఉందని, అదేంటో 12వ తేదీన తెలుపుతామంటున్నారు. ఇక 'ఖైదీ నెంబర్‌ 150' చిత్రానికి అదిరిపోయే పాటలను అందించిన యువ సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్‌ అద్భుతమైన ట్యూన్స్‌ ఇచ్చారట. దిల్‌రాజు-దేవిశ్రీల కాంబినేషన్‌ అంటేనే పాటలు అద్బుతంగా ఉంటాయనే పేరుంది. మరి మంచి ఊపుమీదున్న దేవిశ్రీ ఈ చిత్రానికి ఎలాంటి సంగీతాన్ని అందించాడో వేచిచూడాల్సివుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ