చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం ఈ సంక్రాంతికి విడుదలవుతుంది. ఈ చిత్రం బాలకృష్ణ కి 100వ చిత్రం కావడం.... ఒక డిఫరెంట్ కథతో సినిమాని తెరకెక్కించడం ... ఈ చిత్రానికి జాతీయ అవార్డు విన్నింగ్ గ్రహీత క్రిష్ తెరకెక్కించడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇంకా ఈ చిత్రంలో బాలీవుడ్ లో ఒకప్పటి యాక్ట్రెస్ అయిన హేమమాలిని బాలకృష్ణకి తల్లిగా నటించడం... శ్రియా శరణ్ బాలయ్య భార్య గా నటించడం వంటి అనేక విషయాలున్న ఈ చిత్రం చాలా తక్కువ సమయంలో తెరకెక్కింది. మరి 'గౌతమీ....' చిత్ర యూనిట్ దగ్గర నుండి, డైరెక్టర్ క్రిష్, బాలకృష్ణ మిగతా యూనిట్ సభ్యులు ఎంత కష్టపడకపోతే ఇంత తక్కువ గ్యాపులో సినిమాని తెరకెక్కించగలిగారో మరి. ఇక ఈ చిత్ర షూటింగ్ సమయంలో బాలకృష్ణకి కొన్ని సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు గాయాలు కూడా అయ్యాయని డైరెక్టర్ క్రిష్ స్వయంగా 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఆడియో వేడుకలో చెప్పాడు.
ఆ సన్నివేశాల్లో ఒక పసిబిడ్డని పట్టుకుని గుర్రంపై కెక్కి యుద్ధంలో పాల్గొన్న బాలకృష్ణ అనుకోకుండా గుర్రం మీద నుండి కిందపడిపోయాడట. అయితే కిందపడినప్పుడు బాలకృష్ణ చేతిలో బిడ్డ కూడా ఉన్నాడట. కానీ కిందపడినా కూడా ఆ బిడ్డకి ఎలాంటి గాయాలు అవ్వకుండా బాలకృష్ణ ఎంతో జాగ్రత్తగా బిడ్డని పట్టుకున్నాడట. ఇక ఆ సన్నివేశాలను చిత్రీకరణ చుట్టూ అగ్నిగోళాలు మండుతూ వుండే సెట్స్ లో జరిగేటప్పుడు .... యుద్ధ సన్నివేశాల్లో గుర్రం కాస్త ముందుకెళ్లాక అగ్ని గోళాలు ఒకవైపున మాత్రమే పేలడం మొదలుపెట్టాయట.. రెండోవైపు పేలకపోవడంతో ముందుకెళ్లాల్సిన గుర్రం వెనక్కి తిరగడంతో బ్యాలెన్స్ తప్పి బాలకృష్ణ గుర్రం మీది నుంచి పసివాడితో సహా కిందకిపడిపోగా... బిడ్డకు ప్రమాదం జరగకుండా భద్రంగా పట్టుకున్నాడట. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తన గురించి పట్టించుకోకుండా.. బిడ్డకేం జరగలేదు కదా అని ఒకింత ఆందోళన చెందారట. అయినా కూడా కేవలం ఒక అరగంట మాత్రమే షూటింగ్ కి రెస్ట్ ఇచ్చి మళ్ళీ షూటింగ్ కి వచ్చేశాడంట బాలకృష్ణ. అయితే ఇదంతా మొరాకోలో జరిగిందట. అక్కడ షూటింగ్ చేసేటప్పుడు ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు.
అయితే ఈ సంఘటనను చూస్తున్న మొరాకో వాసులు, విదేశీయులు మీ హీరో నిజమైన హీరో అంటూ పొగిడేశారట. మరి ఎంతైనా.. మా బాలయ్య గ్రేట్ కదా అంటున్నారు నందమూరి ఫ్యాన్స్.