ఒకప్పుడు హీరోలతో సమానంగా కేరెక్టర్ లో మెప్పించిన విజయశాంతి స్టార్ హీరోలందరి పక్కన హీరోయిన్ గా చాలా సినిమాలలో నటించింది. అసలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు విజయశాంతి పెట్టింది పేరు. ఇక ఆ చిత్రాలు ఒక స్టార్ హీరో చిత్రానికి ఏమాత్రం తీసిపోకుండా కలెక్షన్స్ వర్షం కురిపించాయి. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, బాలీవుడ్ చిత్రాలలో నటించి ఎంతోమంది అభిమానులని సంపాదించుకుంది. ఇక ఆమె తీసిన కొన్ని చిత్రాలు వరసబెట్టి ప్లాప్ అవడంతో.... ఇక సినిమాల మీద నుండి తన దృష్టిని పాలిటిక్స్ మీదకి మళ్లించింది. రాజకీయాలమీద మక్కువతో ఆమె పాలిటిక్స్ లోకి అడుగుపెట్టింది. కొన్ని రోజులు కేసీఆర్ తో మంచి అనుబంధాన్ని కొనసాగించిన విజయశాంతి తర్వాతి కాలంలో విభేదించి ఆయనతో వైరం కొని తెచ్చుకుంది.
ఇక పాలిటిక్స్ లో కూడా పెద్దగా రాణించలేక పోయింది. మళ్ళీ పాలిటిక్స్ నుండి ఇప్పుడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనుందని ప్రచారం మొదలైంది. అసలు విజయశాంతి చిరు రీఎంట్రీ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' లో ఒక ముఖ్యపాత్ర పోషిస్తుందని వార్తలు అప్పట్లో ఫిలింనగర్ లో చెక్కర్లు కొట్టాయి. కానీ అవన్నీ వట్టి రూమర్స్ అని తేలిపోయాయి. మళ్ళీ ఇన్నాళ్లకు విజయశాంతి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుందనే వార్తలు మాత్రం కొంచెం గట్టిగానే వినబడుతున్నాయి. అయితే ఒకప్పుడు లేడీ అమితాబ్ గా దూసుకుపోయిన విజయశాంతి మళ్ళీ ఇప్పుడు కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్ర ద్వారానే ఈసినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుందని అంటున్నారు. ఇక ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, బాలీవుడ్ భాషల్లో విడుదల చేస్తారని అంటున్నారు. అయితే ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు? అసలు నిజంగానే విజయశాంతి సినిమాల్లోకి వస్తుందా? అనేది రాములమ్మ స్పందనపై ఆధారపడి ఉంటుంది.