చిరంజీవి - కాజల్ అగర్వాల్ జంటగా నటించిన 'ఖైదీ నెంబర్ 150' చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఫంక్షన్ గా మెగా ఈవెంట్ నిన్న సాయంత్రం హాయ్ ల్యాండ్ లో జరుపుకుంది. ఇక 'ఖైదీ...' చిత్రానికి సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ ని తాజాగా విడుదల చేశారు. ఇక ట్రైలర్ లో చిరంజీవి చాలా యంగ్ గా కనిపించాడు. జైలు సీన్ తో మొదలైన ట్రైలెర్ రత్తాలు... రత్తాలు సాంగ్ తో, ఫైట్స్ తో హోరెత్తించింది. ఇక ఇందులో వున్న కొన్ని డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘నాది వన్‌వే... కష్టం వస్తందో కార్పొరేట్ సిస్టమ్ వస్తందో రమ్మను’.... ‘పొగరు నావంట్లో వుంటది.. హీరోయిజం నాఇంట్లో వుంటది అంటూ చిరంజీవి చెప్పే డైలాగ్స్ తో ట్రైలర్ దడ దడలాడించిందనడంలో సందేహం లేదు. అంతేకాకుండా రైతు సమస్యలను తీర్చే వ్యక్తిగా చిరు అరిపించేసాడు. ఇక కాజల్ తో చిరు రొమాంటిక్ సీన్స్ తో పాటు సాంగ్స్ లొకేషన్స్ కూడా సూపర్ అనిపించేలా వున్నాయి. చిరంజీవి డ్యాన్స్, లొకేషన్స్ చాలా బాగున్నాయి. మెగాస్టార్స్ ఫ్యాన్స్‌కి ఏం కావాలో ట్రైలర్‌లో అవన్నీ చూపించేసారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ మెగాస్టార్ చిరు మెరిశాడు.