'ఖైదీ.....' ప్రీ రిలీజ్ ఫంక్షన్ గురించి గత 10 రోజులుగా మీడియా అంతా ఒకటే వార్తలతో హడావిడిగా వుంది. ఇక ఎంతోమంది పోలీస్ లతో ఏపీ ప్రభుత్వం హయ్ ల్యాండ్ పరిసర ప్రాంతాలలో గట్టి బందోబస్తుని ఏర్పాటు చేసింది. ఇక ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది 'ఖైదీ నెంబర్ 150 ' ప్రీ రిలీజ్ ఫంక్షన్. ఇక ఫంక్షన్ కి ఒక్క పవన్ తప్ప మిగతా మెగా హీరోలందరూ హాజరయ్యారు. ముఖ్య అతిధిగా దాసరి నారాయణరావు హాజరవగా.... అతిధిగా సుబ్బిరామిరెడ్డి ఇంకా ఏపీ మంత్రులు ఈ వేడుకకి హాజరయ్యారు. ఇక రామ్ చరణ్ సూపర్ లుక్ తో ఈ ఫంక్షన్ లో కనబడగా.... చిరంజీవి మాత్రం చాలా యంగ్ లుక్ లో అభిమానులని అలరించాడు. ఇక చిరంజీవి డైరెక్టర్ వి.వి వినాయక్ ని ఆకాశానికి ఎత్తెయ్యగా.... ఇక మిగతా మెగా హీరోలంతా చిరంజీవి గారికి విషెస్ చెప్పారు. అయితే చిరు పెద్ద తమ్ముడు నాగబాబు మాత్రం రచయిత యండమూరి వీరేంద్రనాథ్ మీద, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మీద ఇండైరెక్ట్ గా ఫైర్ అయ్యాడు. వారేదో పనిపాటాలేక సొల్లు మాట్లాడుతున్నారంటూ ఘాటుగా స్పందించాడు. ఇక చిరంజీవి మాత్రం 'ఖైదీ నెంబర్ 150 ' గురించి మాట్లాడుతూ కొంచెం ఎమోషన్ అయ్యాడు. ఇంకా ఈ ఈవెంట్ కి మెగా డాటర్స్ నిహారిక, సుశ్మిత, శ్రీజలు హాజరుకాగా.... హీరోయిన్ కాజల్ కూడా ఈ వేడుకకి చీర కట్టులో దర్శనమిచ్చింది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ మాత్రం చాలా తొందరగానే ముగించేశారు. కేవలం రెండున్నర గంటల్లోనే ఈ ఈవెంట్ ని ముగించేసి అందరూ స్టేజి దిగి వెళ్లిపోవడం అభిమానులని కొంచెం నిరాశపరిచింది. అయితే ఫ్యాన్స్ ని కంట్రోల్ చెయ్యలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఏది ఏమైనా ఎంతోకాలం నుండి ఎదురు చూస్తున్న ఈ 'ఖైదీ నెంబర్ 150 ' ప్రీ రిలీజ్ ఫంక్షన్ మాత్రం కాస్త చప్పగా జరిగిందనే కామెంట్స్ పడిపోతున్నాయి.