ఎన్టీఆర్, బాబీ డైరెక్షన్ లో ఒక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబందించి అన్ని కార్యక్రమాలు జరుపుకుని స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకుని ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నారు బాబీ అండ్ బ్యాచ్. అయితే ఇంకా సినిమా షూటింగ్ స్టార్ట్ చేసుకోకముందే ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ ఒక టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. అయితే ఎన్టీఆర్ - బాబీ కాంబినేషన్ చిత్రానికి ఇంకా టైటిల్ అంటూ ఏం అనుకోలేదని కళ్యాణ్ రామ్ మీడియాకి తెలిపాడు.
ఇక ఇప్పుడు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో ఒక టైటిల్ ని రిజిస్టర్ చేయించినట్లు.... ఆ టైటిల్ ఎన్టీఆర్ సినిమా కోసమే అని వార్తలొస్తున్నాయి. అయితే ఆ టైటిల్ ని 'జై .. లవ.. కుశ’ అని రిజిస్టర్ చేయించినట్లు చెబుతున్నారు. మరి ఇదైనా ఎన్టీఆర్ చిత్ర టైటిల్ అవుతుందో లేక ఇది కూడా కాదో? అనేది కళ్యాణ్ రామే చెప్పాలి. ఇక ఎన్టీఆర్ కి జోడిగా హీరోయిన్ ని ఎంపిక చెయ్యాల్సిన ఈ చిత్రం ఫిబ్రవరి నుండి సెట్సమీదకెళ్లనుందని సమాచారం. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ 'జై .. లవ.. కుశ’ టైటిల్ ఎన్టీఆర్ కి ఏమాత్రం సూట్ కాదని అంటున్నారు.