గత వారం రోజులనుండి మీడియాలో ఒకటే రచ్చ నడుస్తుంది. అదేమిటంటే పవన్ కళ్యాణ్ అన్న చిరు నటించిన 'ఖైదీ నెంబర్ 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వస్తాడా?రాడా? అని. పవన్ కళ్యాణ్ 'ఖైదీ...' ఫంక్షన్ కి రావాల్సిందిగా చరణ్ కూడా ఇన్విటేషన్ ఇచ్చినట్లు మీడియాకి తెలిపాడు. ఇక పవన్ కళ్యాణ్ ని ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి రప్పించడానికి పవన్ కళ్యాణ్ వదిన, చిరు భార్య సురేఖ కూడా రంగంలోకి దిగినట్లు వార్తలొచ్చాయి. అసలు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మెగా హీరోలందరూ హాజరవుతున్నా కూడా అందరి ఫోకస్ పవన్ కళ్యాణ్ మీదే వుంది. ఇక పవన్ వస్తాడా... లేదా.. అనేది మాత్రం ఇప్పటివరకు ఒక క్లారిటీ రాలేదు.
ఇక పొతే పవన్ గనక ఈ ఫంక్షన్ కి వచ్చినా ప్రాబ్లమే.... రాకపోయినా ప్రాబ్లమే.. అంటున్నారు చాలామంది. ఒకవేళ పవన్ గనక 'ఖైదీ....' ఫంక్షన్ కి రాకపోతే అన్నదమ్ముల మధ్యన విభేదాలు కన్ఫర్మ్ అని ఫైనల్ చేసేస్తారు. ఇకపొతే పవన్ గనక ఈ ఫంక్షన్ కి హాజరైతే ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ అంతా పవన్ మీదే ఉంటుంది. జనంలో పవన్ క్రేజ్ అలాంటిది మరి. అలా అయితే గత తొమ్మిదేళ్లుగా రాజకీయాల్లో ఉంటూ అందులో ఫెయిల్ అయ్యి మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న చిరుకి దక్కాల్సిన క్రేజ్ అంతా పవన్ కళ్యాణ్ తన్నుకు పోవడం ఖాయం. సో పవన్ ఈ ఫంక్షన్ కి దూరంగా ఉంటేనే మంచిదనే భావనను వ్యక్తం చేస్తున్నారు కొందరు.
ఇక 'ఖైదీ...' ప్రీ రిలీజ్ వేడుకకి ఖచ్చితంగా పవన్ రాడని సంకేతాలు వినిపిస్తున్నాయి. అన్నయ్య ప్రతిష్టాత్మక చిత్రంలో ఫ్యాన్స్ ఫోకస్ అంతా అన్నయ్య చిరు మీదే ఉండాలని... తాను గనక ఫంక్షన్ అటెండ్ అయితే ఫోకస్ డివైడ్ అవుతుందని పవన్ భావిస్తున్నట్టు సమాచారం. అందువలనే ఈ ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ హాజరవడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మెగా హీరోలందరి ఫ్యాన్స్ కలసికట్టుగా ఉన్నామని చెబుతున్నప్పటికీ... పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం మెగా హీరోలందరికీ దాదాపు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. అందువలనే పవన్ ఈ 'ఖైదీ నెంబర్ 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి హాజరవడం వలన ఫ్యాన్స్... మెగా ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ అంటూ రెండుగా చీలిపోయే అవకాశం ఎక్కువగా ఉందని అందుకే ఈ ఫంక్షన్ కి హాజరు కాకపోవడమే మంచిదనే అభిప్రాయంలో పవన్ ఉన్నట్లు సమాచారం.
ఏది ఏమైనా పవన్ వస్తాడా? రాడా? అనేది మాత్రం మరి కొద్దిసేపట్లో తేలిపోనుంది.