ప్రస్తుతం స్టార్‌కమెడియన్‌గా దూసుకుపోతున్న థర్టీ ఇయర్స్ పృథ్వీ తన కెరీర్ ప్రారంభంలో టాలెంట్ ఉన్నా కూడా అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా 'ఖడ్గం' చిత్రంలో ఆయన నటన చూసిన మీడియా వారు ఆయనను ఆకాశానికి ఎత్తేశారు. కానీ ఆ తర్వాత కూడా ఆయనకు పెద్దగా ఛాన్స్‌లు రాలేదు. దాంతో కొందరు జర్నలిస్ట్‌లు తమ వంతు బాధ్యతగా భావించి.. ఎంతో టాలెంట్ ఉన్న పృథ్వీకి సరైన అవకాశాలు ఇవ్వడం లేదని, బ్రహ్మానందం, సునీల్ వంటి సీనియర్స్ దూసుకుపోతున్నారని, వారి హవా వల్లనే పృథ్వీకి సరైన అవకాశాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆర్టికల్స్ కూడా రాశారు. ఇలా పృథ్వీకి నేడున్న స్టార్‌డమ్‌కి మీడియా సపోర్ట్ ఎంతో ఉంది. ఇది అక్షరసత్యం. ఈ విషయాన్ని ఎన్నో సార్లు పృథ్వీ కూడా స్వయంగా తెలిపాడు.
తాజాగా ఆయన చిరంజీవి నటిస్తున్న 'ఖైదీ నెంబర్ 150' చిత్రంలో తన సీన్స్‌ను డిలేట్ చేయడంతో ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. 'చాలా బాధగా ఉంది. చిరంజీవి గారి 150వ చిత్రమైన 'ఖైదీ నెంబర్ 150'లో నటించడం నా అదృష్టం. సీన్స్ డిలేట్ చేయడం నా దురదృష్టం. పండగ పూట మా అమ్మ చనిపోయినట్లుగా ఉంది...' అంటూ తన ఆవేదన వెల్లగక్కాడు. దాంతో మీడియా మొత్తం పృథ్వీ సీన్స్‌ను కావాలనే తొలగించినట్లు కనిపిస్తోందంటూ ఆయనకు మద్దతుగా నిలిచారు. కానీ ఆ పోస్ట్‌ని ఆయన ఆ తర్వాత డిలేట్ చేశాడు. ఇదంతా వెబ్‌సైట్స్ వారంతా పుట్టించిన రూమర్స్ అని అంటున్నాడు. తన మాటలను మీడియా వక్రీకరించిదని తేల్చిచెబుతున్నాడు. దీంతో వెబ్‌మీడియా మొత్తం ఒక్కసారిగా షాక్‌కి గురైంది. ఆయనపై ఈ విషయంలో ఎవరి నుండి ఒత్తిడి వచ్చిందో అందరికీ అర్థమవుతోంది. అలా పోస్ట్ పెట్టినందుకు క్షమాపణలు చెప్పిఉంటే హుందాగా ఉండేది. కానీ తప్పంతా మీడియాదే అని ఆయన చెప్పడం చూసి, మీడియానే కాదు... సోషల్‌మీడియాను కూడా బాగా ఫాలో అయ్యేవారు కూడా దీనిపై మండిపడుతున్నారు. ఛ.. ఇదేం కర్మరా బాబూ...! అంటూ నిట్టూరుస్తున్నారు.