ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎవరిద్దరు మాట్లాడుకున్నా అది సంక్రాంతికి విడుదల కాబోయే 'ఖైదీ నెంబర్ 150 , గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాల గురించే. ఈ రెండు చిత్రాలు ఆయా హీరోల కెరీర్ లో చాలా ఇంపార్టెన్స్ చిత్రాలు కావడంతో ఈ చిత్రాల విడుదలకు కేవలం ఫ్యాన్స్ కు మాత్రమే కాకుండా సగటు ప్రేక్షకుడు కూడా అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇక బాలకృష్ణ కి 'గౌతమిపుత్ర...' 100 వ చిత్రం కావడం, చిరు కి 'ఖైదీ...' 150 వ చిత్రం కావడం వల్ల ఈ చిత్రాలపై విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఈ రెండు చిత్రాలు రెండు వేర్వేరు జోనర్స్ లో రావడం, రెండు కథలకి చాలా తేడా ఉండడం కూడా ఈ చిత్రాలపై అంచనాలు పెరగడానికి కారణమయ్యాయి.
ఎవరి చిత్రాన్ని వారు గొప్పగా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఇప్పటికే 'గౌతమీపుత్ర శాతకర్ణి' భారీ లెవల్లో ఆడియో వేడుకని తిరుపతిలో జరుపుకోగా... 'ఖైదీ...' చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని గుంటూరు సమీపంలోని హాయ్ ల్యాండ్ లో నేడు జనవరి 7న జరపనున్నారు. ఇక 'గౌతమిపుత్ర...'లో బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసాడని అంటున్నారు. కానీ ఎక్కడా ఆఫీసియల్ గా వినబడలేదు. ఇక ఆడియో వేడుకలో కూడా మోక్షు ఎక్కడా కనబడలేదు. కానీ 'ఖైదీ నెంబర్ 150' లో రామ్ చరణ్ ఒక గెస్ట్ రోల్ చేసాడనే ప్రచారం జరుగుతుంది. ఇక రామ్ చరణ్ కూడా నేను కేవలం నాన్న సినిమా 'ఖైదీ....' లో 30 సెకన్లు మాత్రమే కనిపిస్తానని చెప్తున్నాడు. అదీ ఒక సాంగ్ లో చరణ్ కనిపిస్తాడట.
ఇక ఈ 30 సెకన్స్ చెయ్యటానికే చరణ్ కు చాలా టేకులు పట్టిందట. తండ్రితో కలిసి నటించడం ఒక ఎగ్జైట్మెంట్ అని... ఆయనతో షూటింగ్ లో పాల్గొంటే చాలా థ్రిల్ అనిపిస్తుందని చెబుతున్నాడు. ఏది ఎలా వున్నా ఈ రెండు చిత్రాలు ప్రతి ఒక్క విషయంలో పోటీ పడుతూ... చివరికి ఈ రెండు చిత్రాలు సెన్సార్ లో కూడా యు/ఏ సర్టిఫికెట్స్ సాధించి విడుదలకు సిద్ధమయ్యాయి.