Advertisementt

'ఖైదీ...' లో అనుష్క కూడా ఉండేదే..కానీ..?

Sat 07th Jan 2017 03:12 PM
vinayak,khaidi no 150,anushka,brahmanandam  'ఖైదీ...' లో అనుష్క కూడా ఉండేదే..కానీ..?
'ఖైదీ...' లో అనుష్క కూడా ఉండేదే..కానీ..?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం చిరు నటిస్తున్న150వ చిత్రమైన 'ఖైదీ..' అవకాశం వినాయక్‌కు అదృష్టమనే చెప్పాలి. గతంలో చిరుతో ఆయన 'ఠాగూర్‌' చిత్రం చేసి మెప్పించాడు. ఇక 'ఠాగూర్‌' చిత్ర షూటింగ్‌ సమయంలోనే చిరు.. వినాయక్‌తో.. నీ దర్శకత్వంలో నేను, పవన్‌ మరో సినిమా చేయాలని మీ వదిన(సురేఖ) కోరుకుంటుందని అన్నారట. అందులో ఒకటి ఇప్పుడు నిజమైంది అంటూ పలువిశేషాలను మాట్లాడారు వినాయక్. అవి ఆయన మాటల్లోనే.... మానాన్న ఎగ్జిబిటర్‌ కావడంతో సొంత థియేటర్లలో రోజూ సినిమాలు చూస్తూ పెరిగాను. మా నాన్న నన్ను డిగ్రీ పూర్తిచేయించి, ఎస్సైని చేయాలనుకున్నారు. కానీ నేను ఇంటర్మీడియట్‌లోనే చదువు వదిలేసి, 25 ఏళ్లు కూడా నిండని సమయంలో మా ఫ్యామిలీకి ఉన్న 25లక్షల అప్పు ఎలాగైనా నేనే తీర్చాలని ఇండస్ట్రీకి వచ్చాను. సాగర్‌గారి దగ్గర పనిచేయడం నా జీవితాన్ని మలుపు తిప్పింది. సినిమాలలో సంపాదించిన డబ్బును ఈ ఫీల్డ్‌లోనే పెట్టాలని నిర్ణయించుకొని, వైజాగ్‌లో మూడు థియేటర్లు కట్టాను. ఇంకా పలుచోట్ల మల్టీప్లెక్స్‌లు కట్టడానికి స్థలాలు కొన్నాను. నా చిత్రాలు కొన్ని ఫ్లాప్‌ అయివుండవచ్చుగానీ, నా సినిమాల వల్ల ఎవ్వరూ నష్టపోలేదు. 

'యోగి' చిత్రానికి నష్టం వచ్చినప్పటికీ అవి పెద్ద నష్టాలు కావు. 'అఖిల్‌' చిత్రం టేకింగ్‌, మేకింగ్‌పరంగా ఎలాంటి తప్పులేదు. స్టోరీ విషయంలోనే తప్పటడుగు వేశాం. కాగా ఈ చిత్రానికి పెద్ద పెద్దహీరోల స్థాయిలో నైజాంలో 6కోట్లు, వైజాగ్‌లో 3కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి. కానీ ఈ సినిమాను ఎక్కువ రేట్లకు అమ్మడం, ఎక్కువ థియేటర్లలో విడుదల చేయడం మైనస్‌ అయింది. డిస్ట్రిబ్యూటర్లు అడిగినంత మొత్తాన్ని తిరిగి ఇచ్చాను. రెమ్యూనరేషన్‌ కూడా తీసుకోలేదు. నాకు వచ్చిన చెడ్డపేరు కంటే అఖిల్‌ మొదటి చిత్రం ఆడలేదే అని బాధపడ్డాను. అఖిల్‌కు మరోసారి ఖచ్చితంగా హిట్టిస్తాను. ఎన్టీఆర్‌తో 'దానవీరశూరకర్ణ' చేయాలనుకున్నాను. వీలుకాలేదు. 'అదుర్స్‌2'కి సరైన సబ్జెక్ట్‌ దొరకకపోవచ్చు. ఇక 'ఖైదీ...' విషయానికి వస్తే 'కత్తి' చిత్రానికి కామెడీ, మంచి పాటలు ఉండేలా చూసుకున్నాను. చిరు గారి 150వ చిత్రం అంటే పూర్తిగా మేసేజ్‌ ఉండకూడదు.. అలాగని అసలు సందేశమే లేకుండా చేయకూడదు. ఆ విషయంలో నేను సక్సెస్‌ అయ్యాను. ఈచిత్రంలో బ్రహ్మానందం ఉండాలని, ఆయన పాత్ర ఎలా ఉండాలో కూడా చిరుగారే సలహా ఇచ్చారు. దాంతో బ్రహ్మిపాత్రను సినిమాలో ఇరికించాం. మొదట ఇద్దరు హీరోయిన్లను పెట్టాలని.. అనుష్క, కాజల్‌లను అనుకున్నాం. కానీ బ్రహ్మి రావడంతో అనుష్కను పక్కనపెట్టి, ఒక కాజల్‌తోనే చేశాం. ఈ చిత్రంలో ఎవ్వరూ ఊహించని స్థాయిలో చిరు స్టెప్స్‌ వేశారు. ఇక బ్రహ్మిని చిరు ఆటపట్టించే కామెడీ కూడా అద్బుతంగా ఉంటుంది. కామెడీ 'దొంగమొగుడు, రౌడీఅల్లుడు' రేంజ్‌లో ఉంటుందని తెలిపిన వినాయక్‌ ఇంకా పలు విశేషాలను చెప్పుకొచ్చారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ