Advertisementt

పీకే..రికార్డ్స్ అవుట్...దరిదాపుల్లోకి రాలేరెవ్వరు!

Sat 07th Jan 2017 03:10 PM
pk,dangal,amir khan,dangal records  పీకే..రికార్డ్స్ అవుట్...దరిదాపుల్లోకి రాలేరెవ్వరు!
పీకే..రికార్డ్స్ అవుట్...దరిదాపుల్లోకి రాలేరెవ్వరు!
Advertisement
Ads by CJ

దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో తెర‌కెక్కిన అమీర్ ఖాన్ హీరోగా నటించిన 'దంగల్' మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ని రఫ్ ఆడించేస్తుంది. ఇప్పటి వరకు ఉన్న బాలీవుడ్ చిత్రాలు రికార్డ్స్ ని నామ రూపాల్లేకుండా తుడిచేస్తున్న 'దంగల్' ఇప్పుడు అమీర్ గత చిత్రం 'పీకే' కలెక్షన్స్ ని కూడా దాటడానికి రెడీ అయ్యింది. 'పీకే' చిత్రం ప్రపంచ వ్యాప్తం గా వసూళ్లలో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికి 'పీకే' మూవీ బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్. 'పీకే' మూవీ ఇండియాలో దాదాపు 300  కోట్లు కలెక్ట్ చేసింది. ఇక అమీర్ ఖాన్ సినిమాలు చైనా లో కూడా దుమ్ము దులుపుతుంటాయి. అక్కడ కూడా 'పీకే' చిత్రం 100  కోట్లు కొల్లగొట్టింది. అందుకే 'పీకే' మీదున్న ఈ రికార్డ్ కలెక్షన్స్ ను ఇప్పటి వరకు ఏ చిత్రం టచ్ చెయ్యలేకపోయింది. ఇక ఇప్పుడు 'పీకే' అంతు చూస్తానంటుంది అమీర్ ఖాన్ తాజా మూవీ 'దంగల్'. ఇప్పటికే 'దంగల్' మూవీ ఇండియాలో 350  కోట్లు కొల్లగొట్టే దిశగా అడుగులు వేస్తుందని.... అలాగే చైనాలో కూడా ఈ చిత్రం దుమ్ము దులిపే కలెక్షన్స్ రాబడుతుందని చెబుతున్నారు. ఇక ఈ దంగల్, పీకే రికార్డ్స్ ని అతి తొందరలోనే తుడిచి పెట్టి.. ఇండస్ట్రీ హిట్ గా నిలబడి మరే ఇతర సినిమా కూడా దంగల్ కలెక్షన్స్ దరిదాపుల్లోకి రావడానికే భయపడే కలెక్షన్స్ ని రాబట్టే దిశగా దూసుకుపోతుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ