Advertisementt

బిజీ బిజీగా బాలకృష్ణ..!

Sat 07th Jan 2017 02:37 PM
balakrishna,kcr,gautamiputra satakarni,gpsk  బిజీ బిజీగా బాలకృష్ణ..!
బిజీ బిజీగా బాలకృష్ణ..!
Advertisement
Ads by CJ

బాలకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న నూరవ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి విడుద‌ల తేదీ సమీపిస్తున్న కొద్దీ ఈ చిత్రంపై అందరికీ భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఈ చిత్రం తాలూకూ విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో హీరో బాల‌కృష్ణ చాలా బిజీ బిజీగా అడుగులు వేస్తున్నాడు. కాగా ఈరోజు బాలకృష్ణ ప్రగ‌తి భ‌వ‌న్ లో తెలంగాణ సీఎం కేసీర్ ను క‌లిశారు. ఈ సందర్భంగా  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన బాలకృష్ణ త‌న సినిమాకు వినోదపు ప‌న్నును ర‌ద్దు చేసినందుకు గాను కేసిఆర్ కు, బాల‌కృష్ణ ప్రత్యేక ధ‌న్య‌వాదాలు తెలిపాడు.

ఈ సందర్భంగా.. గౌత‌మీపుత్ర శాతకర్ణి చిత్రం ప్రత్యేక ప్ర‌దర్శ‌న‌కు రావాలని బాలకృష్ణ, కేసీఆర్ ను కోరాడు. కాగా ఈనెల 12వ తేదీన హైద‌రాబాద్ లో ప్రదర్శించే ప్రత్యేక షోకు వ‌స్తాన‌ని కూడా కేసీఆర్  వెల్లడించినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని బాలకృష్ణ మీడియాకు వివరించాడు. కాగా చాలాకాలం తర్వాత సంక్రాంతి బరిలో చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలు ఉండటంతో అభిమానుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ