ఈ మధ్యకాలంలో మరీ ముఖ్యంగా 'బాహుబలి పార్ట్ 1' చిత్రీకరణ, విడుదల తేదీ వంటి వాటి విషయాలలో రాజమౌళి పలుసార్లు మాటతప్పాడు. కానీ మాట తప్పిన ప్రతిసారి తన పనితనంతో మెప్పించాడు. కానీ జక్కన్నతో పాటు 'బాహుబలి' హీరో ప్రభాస్ అభిమానులకు కూడా ఇది తీవ్రంగా నిరాశపరుస్తోంది. తాజాగా 'బాహుబలి పార్ట్2' విషయంలో కూడా జక్కన్న మరోసారి మాటతప్పాడు.ఈ చిత్రం షూటింగ్‌పార్ట్‌ను మొత్తం డిసెంబర్31 కల్లా పూర్తి చేసి, తన యూనిట్‌లోని అందరికీ గ్రాండ్ పార్టీ ఇవ్వడానికి కూడా ప్లాన్‌చేశాడు. దీంతో ప్రభాస్ దీని తర్వాత తాను చేయబోయే సుజిత్-యువిక్రియేషన్స్ చిత్రాన్ని త్వరలోనే ప్రారంభించాలని భావించాడు. కానీ ఆయన ఆశ నీరుగారిపోయింది. తమ చిత్రం కాస్త లేటు అవుతుందని సుజీత్ ఈమధ్య ట్విట్టర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా 'బాహుబలి పార్ట్2'ను ఈనెలాఖరు కల్లా పూర్తి చేయాలని జక్కన్న భావిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి రీరికార్డింగ్‌ను కీరవాణి ప్రారంభించాడు. మరోవైపు సినిమాకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ పనులను విదేశీ టెక్నీషియన్స్ స్పీడుగా పూర్తిచేస్తున్నారు. కొందరు మాత్రం ఈ చిత్రం షూటింగ్ పార్ట్ అనుకున్నట్లుగానే డిసెంబర్31కి పూర్తయిందని, అవుట్‌పుట్ పట్ల జక్కన్న సంతృప్తిగా లేకపోవడంతో పలు సీన్స్‌ను రీషూట్ చేస్తున్నాడని అంటున్నారు. కానీ ఈ ప్రభావం చిత్రం రిలీజ్ డేటైన ఏప్రిల్ 28పై మాత్రం ప్రభావం ఉండదని, అనుకున్న సమయానికే చిత్రం విడుదల చేయాలని జక్కన్న పట్టుదలతో ఉన్నాడు. మరి ఈసారైనా ఆయన మాట నిలబెట్టుకుంటాడా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది..! తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ప్రభాస్ కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అయినట్లుగా..తెలుస్తుంది.