Advertisementt

ఈ హీరోకి గుండె కుడివైపు వుంటుందట..!

Fri 06th Jan 2017 02:36 PM
nikhil,heart patient,swamy ra ra,sudhir varma,nikhil movies  ఈ హీరోకి గుండె కుడివైపు వుంటుందట..!
ఈ హీరోకి గుండె కుడివైపు వుంటుందట..!
Advertisement
Ads by CJ

ఒకప్పుడు యంగ్‌ హీరోలంటే కేవలం ప్రేమకథాచిత్రాలకే పరిమితం అనే చెడ్డపేరు ఉండేది. కొందరు యంగ్‌హీరోలు కొన్ని చిత్రమైన, విచిత్రమైన ఫీట్లు చేస్తూ, ప్రేక్షకులకు థ్రిల్‌ కలిగించని కథలతో, అర్ధంకాని స్టోరీలతో వచ్చి పరాజయం పాలయ్యారు. దాంతోనే యంగ్‌హీరోలపై ఆ ముద్ర పడిందని చెప్పాలి. కానీ ప్రస్తుతం మాత్రం కొందరు యంగ్‌హీరోలు వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూనే జనరంజకంగా చెప్పి, వాటిల్లో కమర్షియల్‌ అంశాలను మిస్‌ కాకుండా చూసుకుంటూ దూసుకుపోతున్నారు. వరుణ్‌సందేశ్‌తో పాటు నిఖిల్‌ వంటి వారు కూడా ఒకేసారి పరిశ్రమకు పరిచయమయ్యారు. వరుణ్‌సందేశ్‌ మాత్రం మూస ప్రేమకథా చిత్రాలు చేస్తూ కనుమరుగైపోతున్నాడు. కాగా నిఖిల్‌ మాత్రం ధైర్యే సాహసే లక్ష్మీ అనే దానిని నమ్ముతూ దూసుకుపోతున్నాడు. వాస్తవానికి 'యువత' చిత్రం తర్వాత నిఖిల్‌ కూడా మాస్‌ హీరోగా పేరు తెచ్చుకోవడానికి తాపత్రయపడిన మాట వాస్తవం. కానీ ఇలా చేస్తే తాను పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకోలేనని త్వరగానే గ్రహించి, 'స్వామి...రా..రా' వంటి వైవిధ్యచిత్రంతో హిట్‌ కొట్టాడు. ఆతర్వాత కూడా 'కార్తికేయ, సూర్య వర్సెస్‌ సూర్య' వంటి విభిన్న చిత్రాలతో మెప్పించాడు. వాస్తవానికి సూర్యున్ని చూడలేని హీరోగా ఉండే 'సూర్య వర్సెస్‌ సూర్య' వంటి సబ్జెక్ట్‌ను మిగిలిన హీరోలైతే చేయరనే చెప్పాలి. కానీ నిఖిల్‌ ఆ పనిని చేసి చూపించాడు. 

ఇక తాజాగా వచ్చిన సంచలన చిత్రం 'ఎక్కడిపోతావు చిన్నవాడా' చిత్రంతో 30కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, నోట్ల రద్దు వంటి క్లిష్టపరిస్థితుల్లో కూడా అద్భుత విజయం అందుకున్నాడు. ఇతర హీరోలు కలలో కూడా ఊహించలేని సబ్జెక్ట్‌లను ఆయన ఎంచుకుంటున్నాడు. కాగా ప్రస్తుతం ఆయన తనకు తొలిబ్రేక్‌ ఇచ్చిన సుధీర్‌వర్మ దర్శకత్వంలో 'కేశవ' అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం పోస్టర్‌ చూసి మరలా నిఖిల్‌ మాస్‌ బాట పట్టాడేమో అని సందేహపడ్డారు. కాగా ఈ చిత్రం కూడా ఓ విభిన్నపాయింట్‌తో రూపొందుతోందని అర్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం ప్రతి మనిషికి ఎడమవైపు గుండె ఉంటుంది. కానీ ఈ చిత్రంలో హీరో అయిన నిఖిల్‌కు మాత్రం గుండె కుడివైపు ఉంటుంది. దాంతో ఆయనకు పలు ఆరోగ్యసమస్యలు వస్తాయి. ఆయన కోపం, టెన్షన్‌ తెచ్చుకోకూడదు. తెచ్చుకుంటే ప్రాణానికే ప్రమాదం. అలాంటి పరిస్థితుల్లో ఆయన కొందరిపై పగ తీర్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. దాంతో ఎప్పుడూ కూల్‌గానే ఉంటూ, కోపం, టెన్షన్‌ తెచ్చుకోకుండా ఎలా పగ తీర్చుకున్నాడనేదే ప్రధాన కథాంశమని తెలుస్తోంది. అందుకే 'కేశవ' చిత్రం పోస్టర్‌లో 'పగ అనే వంటకాన్ని చల్లగా ఉన్నప్పుడు వడ్డిస్తేనే బాగుంటుంది' అనే క్యాప్షన్‌ పెట్టారు. మరి 'సూర్య వర్సెస్‌ సూర్య'లో సూర్యున్ని చూడలేని ప్రోబ్లం  ఉన్న హీరో, 'కేశవ'లో గుండె కుడివైపు ఉండే పాత్రను చేస్తున్నాడన్నమాట. ఈ చిత్రం విడుదలై మంచి విజయం సాధిస్తే మాత్రం నిఖిల్‌ రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోవడం ఖాయమంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ