'ఖైదీ నెంబర్ 150' ప్రీ రిలీజ్ ఫంక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ మెగా అభిమానులతోపాటు చాలామందికి టెంక్షన్ పెరిగిపోతుంది. ఎందుకంటే మెగా హీరోలు అందరూ ఈ ఫంక్షన్ కి హాజరవుతారని ప్రచారం జరుగుతుండగా.... మిగతా హీరోలందరూ... ఈ ఖైదీ..... ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి హాజరయినప్పటికీ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఈ ఫంక్షన్ కి హాజరవుతాడా లేడా అనేది ప్రస్తుతానికి పెద్ద సమస్యగా.... తలనొప్పిగా మారింది చిరు అండ్ బ్యాచ్ కి. ఇప్పటికే మెగా ఫ్యామిలిలో చాలాసార్లు విభేదాలు వున్నాయంటూ మీడియాలో తెగ హైలెట్ అయిన కూడా... మా మధ్యన ఏం లేదంటూ అప్పుడప్పుడూ చరణ్, చిరులు చెబుతూ వచ్చారు.
కానీ ఇప్పుడు పవన్ గనక ఆ ఫంక్షన్ కి రాకపోతే ఇక మీడియా నోటికి తాళం వెయ్యలేమని అనుకుని రామ్ చరణే స్వయంగా బాబాయ్ పవన్ కి ఇన్విటేషన్ ఇచ్చినట్లు చెప్పాడు. నేను పిలిచాను ఆయన ఇష్టం వస్తాడో రాడో అనేది. ఆయనేం చిన్న పిల్లాడు కాదని తీవ్రంగా స్పందించిన చరణ్ కి కూడా ఇప్పుడు టెంక్షన్ ఎక్కువైందని అంటున్నారు. ఇక ఇదంతా చూస్తున్న పవన్ కళ్యాణ్ వదినమ్మ, చిరు భార్య, చరణ్ తల్లి సురేఖ పవన్ కళ్యణ్ ని ఖైదీ.... ఫంక్షన్ కి రప్పించే బాధ్యతను తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఎందుకంటే వదినమ్మ తనకు తల్లితో సమానమని పవన్ ఇప్పటికే చాలాసార్లు, చాలా సందర్భాలలో చెప్పాడు. అందుకే ఆ నమ్మకంతోనే సురేఖ పవన్ ని ఈ ఫంక్షన్ కి రప్పించే బాధ్యత తీసుకుందని అంటున్నారు.
ఇక పవన్ ఇంటికెళ్లి మరీ సురేఖ, పవన్ ని ఆహ్వానించనున్నట్లు తెలుస్తుంది. ఇక తల్లిలాంటి వదినమ్మ పిలిస్తే పవన్ తప్పక ఈ ఫంక్షన్ కి హాజరవుతాడనే అశాభావం వ్యక్తం చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. అయినా అన్నయ్య చిరు, కొడుకు చరణ్ పిలిచినా రానివాడు ఇప్పుడు వదినమ్మ పిలిస్తే మాత్రం వస్తాడా? ఏంటి అని చాలామంది సెటైర్స్ వేస్తున్నారు. అసలింత జరుగుతున్నాకూడా పవన్ మాత్రం ఏం స్పందించడం లేదు. ఇప్పుడే కాదు పవన్ ఎప్పుడూ ఈ విషయమై నోరు విప్పి మాట్లాడింది లేదు. అసలు 'ఖైదీ....' రిలీజ్ టెంక్షన్ కన్నా మెగా ఫ్యామిలీ వారికి ఇప్పుడు పవన్ టెంక్షన్ మాత్రం ఎక్కువైందనేది మాత్రం సత్యం.