భారత ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేసి సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యంగా నల్లధనాన్ని అరికట్టాలని చేసిన ఈ రద్దు ప్రభావం ఇంకా సామాన్య జనానికి కష్టాలు తెచ్చిపెడుతూనే ఉంది. దాదాపు నోట్ల రద్దు చేసి రెండు నెలలు దాటినా ఆ ప్రభావం నుండి ఇంకా జనాలు కోలుకోలేని పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. కాస్త ఇప్పుడిప్పుడే పరిస్థితి అదుపులోకి వస్తుంది. కాగా ప్రజలంతా కూడా పైకి మోడీ నిర్ణయంపై విజయాన్ని పలుకుతున్నా లోలోపల మాత్రం కష్టాలు కుదులుకుంటూనే ఉన్నారు. మోడీ నిర్ణయం కారణంగా చాలా నష్టాలు చవిచూసిన ప్రజలు ఆ విషయాన్ని ఎవరూ కూడా డైరెక్టుగా చెప్పలేకపోతున్నారు. అంతెందుకు సినీరంగాన్ని మోడీ నిర్ణయం ఎంత కుదేలు చేసినా సినీ ప్రముఖులు మాత్రం వంతపలికారే తప్ప ఇప్పటివరకు ఎవరూ కూడా నెగెటివ్ గా తమ అభిప్రాయాన్ని చెప్పకపోవడం విశేషం. కాగా తాజాగా దర్శకరత్న దాసరి నారాయణరావు మాత్రం మోడీ నిర్ణయానికి భిన్నంగా స్పందించాడు. దేశంలో కొనసాగుతున్న డిమానిటైజేషన్ కారణంగా భారతదేశం సుమారు పదేళ్లపాటు వెనక్కి వెళ్లిపోయినట్లయిందని దాసరి సంచలన రేపేలా వెల్లడించాడు.
ముఖ్యంగా దాసరి నారాయణ రావు మాట్లాడుతూ... సినీ పరిశ్రమలో క్యాష్ లెస్ ట్రాన్సక్షన్స్ అస్సలు సాధ్యపడే అవకాశమే లేదని, అస్సలు సినీ జనాలు చెక్కులిస్తే అవి చెల్లుబాటు అవుతాయో లేదోనని సందేహంతో ఎవరూ తీసుకోడానికి కూడా సందేహిస్తారని ఇలాంటి పరిస్థితి మొదటి నుండి సినీ పరిశ్రమను పీడిస్తుందని ఆయన తెలిపాడు. అంచేత సినీరంగంలో ప్రముఖంగా చెక్కులు చాలా అసాధ్యంతో కూడుకున్న తంతుగా ఆయన వివరించాడు. కానీ దాసరి ఇంత లేట్ గా స్పందించడమే బాలేదు అంటున్నారు..ప్రముఖులు.