Advertisementt

చిరు వర్సెస్ బాలయ్య....ఇది 15వ సారి..!

Thu 05th Jan 2017 11:41 AM
chiranjeevi,balakrishna,chiranjeevi vs balakrishna,sankranthi,khaidi no 150 vs gautamiputra satakarni  చిరు వర్సెస్ బాలయ్య....ఇది 15వ సారి..!
చిరు వర్సెస్ బాలయ్య....ఇది 15వ సారి..!
Advertisement
Ads by CJ
బాలకృష్ణ, చిరంజీవి సంక్రాతి బరిలో పోటా పోటీగా దిగుతున్నారు. ఇక బాలకృష్ణ కెరీర్లో 100 వ చిత్రంగా గౌతమీపుత్ర శాతకర్ణి , చిరంజీవి 150 వ చిత్రం ఖైదీ నెంబర్ 150 తో పోటీకి దిగారు. ఏదో ఇద్దరి మధ్యన ఏం లేదంటూనే ఇంత గట్టి పోటీని ఇస్తున్న వీరు ఇంతకుముందు కూడా చాలాసార్లే తలపడ్డారు. వీరు తమ కెరీర్ లో దాదాపు 14  సార్లు తలపడినట్లు.. ఇప్పటి పోటీ 15వ సారిగా అంటున్నారు. ఇక వారు తలపడిన సినిమాల లిస్ట్ ఇలావుంది...
మంగమ్మగారి మనవడు – ఇంటిగుట్టు - 1984
కథానాయకుడు – రుస్తుం - 1984
ఆత్మబలం – చట్టంతో పోరాటం - 1985
నిప్పులాంటి మనిషి – కొండవీటి రాజా - 1986
అపూర్వ సహోదరులు – రాక్షసుడు - 1986
భార్గవ రాముడు – దొంగ మొగుడు - 1987
రాము – పసివాడి ప్రాణం - 1987
ఇన్ స్పెక్టర్ ప్రతాప్ – మంచిదొంగ - 1988
రాముడు భీముడు – యుద్దభూమి - 1988
పెద్దన్నయ్య – హిట్లర్ - 1997
వంశోద్ధారకుడు – అన్నయ్య - 2000
నరసింహ నాయుడు – మృగరాజు - 2001
భలేవాడివి బాసు – శ్రీ మంజునాథ - 2001
లక్ష్మీ నరసింహ – అంజి - 2004  
ఇక తాజాగా ఇప్పుడు గౌతమి పుత్ర శాతకర్ణి – ఖైదీ నంబర్ 150 - 2017... మరోసారి బరిలోకి దిగుతున్నారు. మరి ఈ 15 వసారి గెలుపెవరిదో ప్రేక్షకులే నిర్ణయిస్తారు.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ