Advertisementt

పవనే కాదు...మెగాస్టార్‌ మనవరాళ్లు కూడా!

Thu 05th Jan 2017 11:27 AM
pawan kalyan,sushmita konidela,dangal,chiranjeevi grand daughters  పవనే కాదు...మెగాస్టార్‌ మనవరాళ్లు కూడా!
పవనే కాదు...మెగాస్టార్‌ మనవరాళ్లు కూడా!
Advertisement
Ads by CJ

అమీర్‌ఖాన్‌ హీరోగా, దర్శకుడు నితీష్‌తివారి దర్శకత్వంలో రూపొందిన 'దంగల్‌' చిత్రం ఫీవర్‌తో దేశం మొత్తం ఊగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 600కోట్ల దిశగా దూసుకుపోతోంది. తాజాగా పవన్‌కళ్యాణ్‌ వంటి నర్మగర్భ మనిషి కూడా ఈ చిత్రాన్ని పొగడకుండా ఉండలేక ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలతో మునిగితేలుతోంది. కాగా ఈ చిత్రాన్ని ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల తన ఇద్దరు ఆడపిల్లలతో సహా చూడటం జరిగింది. ఈ చిత్రం చూసినప్పటి నుంచి ఈ ఇద్దరు మెగాస్టార్‌ మనవరాళ్లు ఇంట్లో కుస్తీలు పడుతూ, పోటీ పడుతున్నారట. ఈ ఫోటోను సుస్మిత పోస్ట్‌ చేసింది. అమీర్‌ఖాన్‌, నితీష్‌ తివారిలు చేసిన 'దంగల్‌' మూవీ కేవలం ఓ సినిమా కాదని, ఈచిత్రం అందరిలో ఓ స్పూర్తిని నింపిందని, ఇప్పటివరకు ఈ చిత్రాన్ని తాను రెండు సార్లు చూశానంటూ ప్రశంసల వర్షం కురిపించింది. కాగా ఈ చిత్రం కేవలం తల్లిదండ్రులు, యువతనే కాదు... చిన్న పిల్లలను కూడా ఫిదా చేస్తోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి? అంటున్నారు విశ్లేషకులు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ