Advertisementt

చిరు, బాలయ్య... చిత్రాల ప్లస్ లు..మైనస్ లు!

Thu 05th Jan 2017 11:19 AM
chiranjeevi,khaidi no 150,balakrishna,gautamiputra satakarni,chiranjeevi and balakrishna plus and mainus points  చిరు, బాలయ్య... చిత్రాల ప్లస్ లు..మైనస్ లు!
చిరు, బాలయ్య... చిత్రాల ప్లస్ లు..మైనస్ లు!
Advertisement

ప్రస్తుతం సంక్రాంతి పోటీలో తలపడుతున్న చిరు, బాలయ్యల ప్రతిష్టాత్మక 150వచిత్రం, 100వ చిత్రాలైన 'ఖైదీ...', 'గౌతమీపుత్ర..' చిత్రాలపై పలు విమర్శలతో పాటు మరికొన్ని ప్రశంసలు కూడా వస్తున్నాయి. దీంతో తమ చిత్రాలపై వస్తున్న విమర్శలకు చెక్‌పెట్టాలని చిరు, బాలయ్యలు రెడీ అవుతున్నారు. తామేమీ మాట్లాడకుండా తమ చిత్రాల ద్వారానే సమాధానం చెప్పాలని వీరిద్దరు ఫిక్స్‌ అయ్యారు. చిరు నటిస్తున్న 'ఖైదీ....' చిత్రంపై వస్తున్న విమర్శల విషయానికి వస్తే... చిరు 9ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తూ, తన 150వ చిత్రంగా చేస్తున్న చిత్రానికి 'కత్తి' రీమేక్‌ను ఎంచుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ ఏజ్‌లో చిరు మునుపటి మ్యాజిక్‌ చేయగలడా? ఆయనకు ఎంతో గుర్తింపును తెచ్చిన డ్యాన్స్‌లు, ఫైట్స్‌ వంటి విషయాలలో 61ఏళ్లలో తన సత్తా చూపించగలడా? ఆయనను రాజకీయాలలోకి వెళ్లకముందులా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తారా? ముఖ్యంగా ఓవర్‌సీస్‌లో ప్రస్తుతం చిరు సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన తరుణంలో పరిస్థితులు మారిపోయాయని, మరి ఆయన.. సినిమాకు ప్రధాన ఆదాయ వనరుగా మారిన ఓవర్‌సీస్‌ను ఆకట్టుకోగలడా? అనే అనుమానాలు పలువురిలో ఉన్నాయి. కాగా ఈ చిత్రం ప్రీరిలీజ్‌ వేడుకకు విజయవాడలో అనుమతి ఇవ్వకపోవడం, దాంతో ఈ వేదిక హాయ్‌ల్యాండ్‌కు మారిన సమయంలో విజయవాడలో చేయాలనుకున్న రేంజ్‌లో హ్యాయ్‌ల్యాండ్‌లో చేస్తారా? అనే అనుమానాలు ఉన్నాయి. వాటన్నింటికి తన ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌ ద్వారా, ట్రైలర్‌ ద్వారా, సినిమా ద్వారా సమాధానం చెప్పాలని గట్టి పట్టుదలతో చిరు ఉన్నాడంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ప్రీరిలీజ్‌ బిజినెస్‌ 100కోట్లకు చేరుకుందని వార్తలు వస్తున్న సమయంలో ఆయన నాన్‌ 'బాహుబలి' రికార్డు అయిన మహేష్‌ 'శ్రీమంతుడు'ను దాటి తన సత్తా చూపించాలని భావిస్తున్నాడట.

మరోవైపు బాలయ్య తన 100వ చిత్రాన్ని సెన్సిబుల్‌ డైరెక్టర్‌ గా పేరుతెచ్చుకున్నప్పటికీ కమర్షియల్‌ హిట్‌లేని క్రిష్‌ చేతిలో పెట్టడంపై విమర్శలతో పాటు ప్రశంసలు కూడా లభిస్తున్నాయి. అందునా తన 100వ చిత్రాన్ని దేశంలోనే కాదు.... ప్రపంచంలోనే గొప్ప వీరుడైన ఎవ్వరికీ తెలియని 'గౌతమీపుత్ర శాతకర్ణి' వంటి హిస్టారికల్‌ చిత్రం చేసి, తెలుగువారి సత్తా చూపించాలని భావించిన బాలయ్యకు ప్రశంసలు లభిస్తున్నాయి. ఇక ఈ చిత్రం 50కోట్ల పైబడ్జెట్‌తో బాలయ్య కెరీర్‌లోనే హయ్యస్ట్‌ బడ్జెట్‌ ఫిల్మ్‌గా రూపొందుతోంది. బాలయ్య మార్కెట్‌కు ఈ బడ్జెట్‌ ఎక్కువే గానీ, హిస్టారికల్‌ చిత్రమైనా దీనిని అంత తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన విజువల్స్‌తో వండర్‌ఫుల్‌గా తెరకెక్కించిన క్రిష్‌ ప్రతిభను ట్రైలర్‌తోనే అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక ఈ గెటప్‌కు వయసు మీరిన బాలయ్య సరిగా సూట్‌ కాలేదని, అదే ఏ ప్రభాస్‌తోనే చేసి ఉంటే బాగుండేదని కూడా విమర్శలు వస్తున్నాయి. కానీ క్రిష్‌ మాత్రం ఈ చిత్రాన్ని చేస్తే బాలయ్యే చేయాలి అనే విధంగా అద్భుతంగా చేశాడని ఎంతో నమ్మకంగా చెబుతున్నారు. మరి ఈ వయసులో చిరు, బాలయ్యలు తమకు తామే సాటి అని నిరూపించుకుంటారా? తిరుపతిలో జరిగిన బాలయ్య ఆడియో వేడుక కంటే చిరు చిత్రం ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌ను అంత కంటే గ్రాండ్‌గా చేస్తారా? అనే వాటికి త్వరలోనే సమాధానం దక్కనుంది. మరోపక్క బాలయ్య కూడా క్రిష్‌ మేకింగ్‌ పట్ల ఎంతో నమ్మకంగా ఉండగా, చిరు చిత్రమైన ఒరిజినల్‌ వెర్షన్‌ 'కత్తి' పూర్తి స్థాయి సందేశాత్మక చిత్రమైన్పటికీ, వినాయక్‌ తనదైన మాస్‌, లుంగీ గెెటప్‌లు, అందునా సందేశాత్మక చిత్రంలో ఐటమ్స్‌ వంటివి పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. అయినా చిరు మాత్రం తనకున్న ఇమేజ్‌కు అనుగుణంగా వినాయక్‌ గొప్పగా మార్పులు చేర్పులు చేశాడని సంతోషంగా ఉన్నాడట. 

ఇంకా ఈ చిత్రాల గురించి చెప్పుకోవాలంటే... బాలయ్యకు కూడా ఓవర్‌సీస్‌ మార్కెట్‌ తక్కువే, కానీ ఆయన రొటీన్‌గా చేసే మాస్‌ చిత్రాలను మెచ్చకపోయినా, ఇలాంటి అద్బుత వీరుని గాధను కొత్తదనంగా ఓవర్‌సీస్‌ ప్రేక్షకులు కూడా భావించి, తమ చిత్రానికి మంచి కలెక్షన్లు ఇస్తారనే నమ్మకం వెల్లడవుతోంది. ఇప్పటివరకు 100కోట్ల మార్కెట్‌లేని బాలయ్య ఈ చిత్రంతో దాన్ని సాధించాలనే పట్టుదలతో ఉన్నాడట. ఈ చిత్రం ప్రీరిలీజ్‌ బిజినెస్‌ కూడా తారాస్థాయిలో ఉండటమే దీనికి తార్కాణం అంటున్నారు. ఈ రెండు చిత్రాల విషయంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు బాలయ్య చిత్రానికే రాజకీయంగా పెద్ద పీట వేస్తున్నాయని, సినిమా విడుదలకు ముందే ఈ చిత్రం చూడకుండానే 'గౌతమీపుత్ర....' చిత్రానికి వినోదపు పన్ను మినహాయించారనే విమర్శలు కూడా వస్తున్నాయి. మరో పక్క ఈ రెండింటి నిర్మాణ బాధ్యతలను, అంటే 'ఖైదీ...'ని స్వయంగా ఆయన తనయుడు చరణ్‌ సొంతగా నిర్మించి తానే సాహసం చేస్తున్నాడని, ఇక బాలయ్య చిత్రాన్ని కూడా ఈ చిత్ర దర్శకుడు క్రిష్‌ తన స్నేహితుడైన రాజీవ్‌ రెడ్డితో నిర్మిస్తుండటం పట్ల హర్షంతో పాటు ఈ చిత్రాలపై వారికి ఉన్న నమ్మకానికి ఎగ్జాంపుల్స్‌గా చెబుతున్నారు. మరోపక్క బాలయ్య ఆడియో వేడుకకు జూనియర్‌, కళ్యాణ్‌రామ్‌, ఆయన అన్నయ్య హరికృష్ణలు రాలేదనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో చిరు చిత్రం ప్రీరిలీజ్‌ వేడుకకు చిరు తమ్ముడు పవన్‌ రావడం లేదని అల్లు స్పష్టం చేయడంతోపాటు, ఈ విషయంలో చరణ్‌ లైవ్‌ వీడియో చాట్‌లో పవన్‌ను పిలుస్తున్న విషయాన్ని తెలుపుతూ ఆయన చేసిన కామెంట్స్‌పై కూడా తాజాగా విమర్శలు మొదలయ్యాయి. ఎంత బిజీ షెడ్యూల్‌లో ఉన్నా కనీసం ఓ సాయంత్రం తన అన్న కోసం కేటాయించలేడా? అనే ప్రశ్నలు పలువురిని వేధిస్తున్నాయి. వీటితో పాటు అల్లు అరవింద్‌.. చరణ్‌, చిరులపై అలిగాడని అంటున్నారు. చిరు నటించే 151వ చిత్రాన్ని గీతాఆర్ట్స్‌ బేనర్‌లో అల్లు నిర్మించాలని భావించి, ప్రకటన కూడా ఇచ్చాడని, కానీ తన తండ్రి తదుపరి చిత్రాన్ని కూడా తానే తన కొణిదెల బేన్‌ర్‌లో చేస్తానని ప్రకటించడమే దీనికి కారణం అని తెలుస్తోంది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement